Dharani
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై తాజాగా కేసు నమోదు అయ్యింది. ఆ వివరాలు..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై తాజాగా కేసు నమోదు అయ్యింది. ఆ వివరాలు..
Dharani
రామోజీ ఫిలిం సిటి పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (ఫిలింసిటీ) గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది సినిమా షూటింగులకే కాక పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మాణం చేసుకున్నాయి. ఇప్పటికి కూడా ఇక్కడ నిత్యం ఎన్నో షూటింగులు జరుగుతుంటాయి. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల మోడల్స్, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల సెట్లు ఉంటాయి. పర్యాటకుల కోసం ఇక్కడ ప్రతి రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా ఉండగా తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. ఆ వివరాలు..
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయినట్లు తెలిసింది. ఫిల్మ్ సిటీ విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఫిల్మ్‌సిటీలోని లైమ్లైట్ గార్డెన్ వద్ద ఈప్రమాదం జరిగింది. ఫంక్షన్ జరుగుతుండగా క్రేన్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.