Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు అంటూ ఫోన్ కాల్.. విమానాశ్రయంలో హై అలెర్ట్!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు అంటూ ఫోన్ కాల్.. విమానాశ్రయంలో హై అలెర్ట్!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఊహించిన ఫోన్ కాల్.. ప్రయాణికులను అందరినీ ఒక్కసారిగా భయందోళనకు గురి చేసింది. ఓ గుర్తు తెలియని దుండగుడు మంగళవారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టులో బాంబు ఉందని ఏకంగా కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ చేసి చెప్పాడు. దీంతో అక్కడి అధికారులు అంతా అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీస్ భద్రతా సిబ్బంది ఎయిర్ పోర్ట్ అంతటా ఆ బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, ఎంత వెతికినా ఆ బాంబు ఉన్నట్లు ఎక్కడా కూడా ఆనవాళ్లు కనిపించలేదు.

దీంతో మొత్తానికి పోలీసులు అన్ని చోట్ల ముమ్మర తనిఖీలు చేపట్టి చివరికి ఇది ఫేక్ కాల్ అని, ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు బాంబు బెదిరింపు కాల్ చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఆ ఫోన్ చేసిన నిందితుడి ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎయిర్ పోర్ట్ లో బాంబు బెదిరింపులు కాల్ రావడంతో ప్రయాణికులు అంతా ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఇది ఫేక్ కాల్ అని తెలియడంతో అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే వార్త ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: HYD: అర్థరాత్రి స్పా సెంటర్ పై పోలీసుల దాడులు.. బట్టబయలైన గలీజ్ దందా!

Show comments