iDreamPost
android-app
ios-app

వీడు అసలు మనిషేనా.. 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన బిలియనీర్‌

Mohamed Al-Fayed: బిలియనీర్ కామాంధుడు ఏకంగా 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. వీడు అసలు మనిషేనా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mohamed Al-Fayed: బిలియనీర్ కామాంధుడు ఏకంగా 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. వీడు అసలు మనిషేనా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడు అసలు మనిషేనా.. 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన బిలియనీర్‌

సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. విచక్షణ మరిచి మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. పశువుల్లా మారి చిన్నపిల్లలు వృద్ధులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇంట్లో, బయట, ఆఫీసుల్లో, పని ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ బిలియనీర్ ఏకంగా 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వందలాది మహిళలపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు ఆ బిలియనీర్. అతను మరెవరో కాదు హారోడ్స్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ యజమాని మహమ్మద్‌ అల్ ఫయద్.

ఇతను తన సంస్థలో పని చేసే ఎంతో మంది మహిళా ఉద్యోగులపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఇటీవల బీబీసీ వార్తా కథనం పేర్కొంది. బ్రిటన్‌లో నివశించిన ఈజిప్ట్‌ బిలియనీర్‌ తన జీవితకాలంలో 400 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023లో మరణించిన హారోడ్స్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ యజమాని మహమ్మద్‌ అల్‌ ఫయద్ తమను వేధించాడని వందల మంది మహిళలు చెబుతున్నట్లు యూకే లాయర్లు వెల్లడించారు. బ్రిటన్‌లో ప్రముఖ లగ్జరీ డిపార్ట్ మెంట్ స్టోర్ హారోడ్స్ సంస్థ మాజీ యజమాని మహ్మద్ అల్ ఫయాద్.. 1985 నుండి 2010 వరకు తన కంపెనీలో పని చేసే అనేక మంది ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే అతడిపై చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమైంది.

ఫయాద్ రాసలీలల గురించి బీబీసీ దీనిపై డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. దీంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సుమారు 400 మంది మహిళలు బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. స్టోర్ అధినేతగా ఉన్న సమయంలోనే ఈ దారుణాలకు ఒడిగట్టినట్లు బాధితులు వెల్లడించారని వారి తరుఫున న్యాయవాదులు చెబుతున్నారు. తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. సీనియర్ సెక్యూరిటీ సిబ్బంది బెదిరించేవారని వాపోయారు. దాదాపు 30 ఏళ్ల పాటు అతడు మహిళలపై లైంగిక దాడులు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. బాధితుల్లొ కొందరు స్టోర్ కు సంబంధించిన మహిళలు కాగా.. మరికొందరు ఫల్ హామ్ ఫుట్ బాల్ క్లబ్, పారిస్ లోని రిట్జ్ హోటల్ ఇతర సంస్థలకు చెందిన వారు ఉన్నారు.

అల్ ఫయాద్ అక్కడ పనిచేసే ప్రతిఒక్కరిని టార్గెట్ చేసేవాడని తెలిపారు. ఇప్పటికే ది జస్టిస్ ఫర్ హారోడ్స్ సర్వైవర్స్ గ్రూప్ నుంచి చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఫ్యూచర్ లో వందలకొద్ది లెటర్ ఆఫ్ క్లెయిమ్స్ హారోడ్స్ కు వెళతాయని లాయర్స్ చెబుతున్నారు. కొంతమంది మహిళలు కోర్టు బయటే సెటిల్ మెంట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరి బిలియనీర్ కామంధుడు ఏకంగా 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.