రెచ్చిపోయిన యువకుడు.. లేడీ IPS అని కూడా చూడకుండా..

ఓ యువకుడు ఏకంగా మహిళా ఐపీఎస్‌ అధికారి మీద రెచ్చిపోయాడు. తప్పు చేయటమే కాకుండా .. ఆమెతో దారుణంగా ప్రవర్తించాడు. చివరకు జైలు పాలయ్యాడు.

ఓ యువకుడు ఏకంగా మహిళా ఐపీఎస్‌ అధికారి మీద రెచ్చిపోయాడు. తప్పు చేయటమే కాకుండా .. ఆమెతో దారుణంగా ప్రవర్తించాడు. చివరకు జైలు పాలయ్యాడు.

గత కొన్నేళ్ల నుంచి జనాలకు పోలీసులంటే అస్సలు భయం లేకుండా పోయింది. కొంతమంది తప్పు చేసినా కూడా పోలీసులపైకే తిరగబడుతున్నారు. పోలీసులపై దాడులు చేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా, ఓ యువకుడు ఏకంగా మహిళా ఐపీఎస్‌ అధికారిపై రెచ్చిపోయాడు. తప్పు చేయటమే కాకుండా ఆమెతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన డాక్టర్‌ వీజే శోభారాణి ఎస్పీగా పని చేస్తున్నారు. బీబీఎంపీలోని బెంగళూరు మెట్రోపాలిటన్‌ టాస్క్‌ ఫోర్స్‌ హెడ్‌ ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. గత బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఆమె గోరుగుంటపాళ్య జంక్షన్‌ దగ్గర తన వాహనంలో డ్యూటీకి వెళుతూ ఉన్నారు. ఆ వాహనం రోడ్డుపై వెళుతున్న సమయంలో… అభిషేక్‌ అనే 22 ఏళ్ల యువకుడు తన బైకుపై వేగంగా ఆమె వాహనానికి ఎదురుగా వచ్చాడు. అతి వేగం కారణంగా అతడి బైకు అదుపు తప్పింది.

 ఎదురుగా వస్తున్న ఐపీఎస్‌ అధికారి శోభారాణి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ మొత్తం సీన్‌లో ఆ యువకుడిదే తప్పు. కానీ, తప్పు చేసి కూడా ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఐపీఎస్‌ అధికారిని తిట్టడమే కాకుండా.. బెదిరింపులకు దిగాడు. ఆమెతో పాటు ఉన్న సిబ్బంది ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనంతో పాటు అతడ్ని స్టేషన్‌కు తరలించారు.

అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు అతడికి జామీను ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎస్‌ అధికారి వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా.. ఆమెనే బెదిరించడాన్ని తప్పుబడుతున్నారు. అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అంటున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలు సరిగా ఫాలో కాని వారి లైసెన్స్‌ రద్దు చేయడమే కాకుండా.. వారిని రోడ్లపై తిరగనీయకుండా చేయాలని కోరుతున్నారు. మరి, అతి వేగంతో వచ్చి మహిళా ఐపీఎస్‌ వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా.. ఆమెపైనే బెదిరింపులకు దిగి జైలు పాలైన అభిషేక్‌ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments