Tirupathi Rao
Bank Manager Got Arrested Regarding A 90 Lakh FD Case In Kollam: బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నా, పెద్ద మొత్తంలో ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది అని తెలుసుకోండి.
Bank Manager Got Arrested Regarding A 90 Lakh FD Case In Kollam: బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నా, పెద్ద మొత్తంలో ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది అని తెలుసుకోండి.
Tirupathi Rao
ధనం మూలం మిదం జగత్ అని ఊరికే అనలేదు. ఈ సృష్టే డబ్బు మీద నడుస్తుంది, డబ్బే ఈ సృష్టిని శాసిస్తుంది అంటూ ఉంటారు. ఒప్పుకోవడానికి కాస్త కష్టంగా ఉన్నా కూడా అదే నిజం. అయితే ఇప్పుడు దానికి ఒక అడుగు ముందుకేసి.. ధనం మూలం ఇదం క్రైమ్ అనే పరిస్థితి కూడా వచ్చేసింది. అంటే నేరాలకు మూల కారణం డబ్బే అంటున్నారు. ఏ క్రైమ్ తీసుకున్నా కూడా కాంత లేదా కనకం మూలంగానే హత్యలు జరుగుతున్నాయి. తాజాగా ఒక కిలాడీ బ్యాంక్ మేనేజర్ అలాంటి ఒక పాడు పని చేసి అందరినీ ఆందోళనకు గురి చేసింది. డబ్బు కోసం ఒక వృద్ధుడిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే కంగారు పడిపోతారు.
ఈ దారుణం కేరళలోని కొల్లాంలో జరిగింది. బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంజినీర్ గా రిటైర్ అయిన పప్పచాన్(82) అనే వృద్ధుడుకి ఒక ప్రైవేట్ బ్యాంకులో రూ.90 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ ఉంది. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తాన్ని ఈ బ్యాంకులోనే దాచాడు. ఆ బ్యాంకు సిబ్బందితో అతనికి మంచి రిలేషన్ కూడా ఉంది. అలాగే పప్పచాన్ గురించి కూడా వారికి బాగా తెలుసు. ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ సరితకు బాగా తెలుసు. అతనికి కుటుంబంతో గొడవలు ఉన్నాయని.. అతను చనిపోయినా కూడా డిపాజిట్ కోసం ఎవరూ రారు అని కూడా తెలుసు. ఒకరోజు పప్పచాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అందరికీ తెలుస్తుంది. దానిని మొదట అంతా యాక్సిడెంట్ అనే అనుకున్నారు. కానీ, దర్యాప్తు చేసిన తర్వాత అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేలుతుంది. పైగా ఆ బ్యాంక్ మేనేజరే అంతా చేసింది అని వెలుగులోకి వస్తుంది.
ఒకరోజు పప్పచాన్ ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతా నుంచి రూ.40 లక్షలు మాయం అవుతాయి. అతనికి తెలియకుండానే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ విషయంపై మేనేజర్ సరితను వృద్ధుడు నిలదీస్తాడు. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగి ఉండచ్చని.. వెంటనే సరిచేస్తానని చెబుతుంది. ఆ తర్వాతే పప్పచాన్ హత్యకు కుట్ర పన్నుతుంది. ఆశ్రమమం గ్రౌండ్ వద్ద పప్పచాన్ సైకిల్ మీద వెళ్తుండగా కారుతో గుద్దేసి పక్కా యాక్సిడెంట్ లా చిత్రీకరించారు. ఈ కేసులో సరిత(45), బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అకౌంటెంట్ అనూప్(37), మరో ఇద్దరు ఉద్యోగులు మహీన్(47), హాసిఫ్ అలి(27), కాంట్రాక్ట్ కిల్లర్ అనిమోన్(44)ను అరెస్ట్ చేశారు. పప్పచాన్ రూ.40 లక్షల గురించి ప్రశ్నించగానే.. వీళ్లంతా కలిసి హత్యకు కుట్ర పన్నారు. అనుకున్నట్లుగానే పప్పచాన్ ను హత్య చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరిచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. పప్పచాన్ కు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. డబ్బుకోసం వృద్ధుడిని హత్య చేసిన ఈ బ్యాంకు సిబ్బందిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.