ప్రేమోన్మాది కిరాతకం.. బతికుండగానే ప్రియురాలి కళ్లకు గంతలు కట్టి..!

ప్రేమోన్మాది కిరాతకం.. బతికుండగానే ప్రియురాలి కళ్లకు గంతలు కట్టి..!

జాస్మిన్ కౌర్, తారిక్ జోత్ సింగ్ ఇద్దరు ప్రేమికులు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతంగా మారిపోయారు. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలోనే ప్రియుడు తన వక్రబుద్దిని చూపించాడు. దీంతో విసుగుచెందిన ఆ యువతి ప్రియుడిని దూరం పెట్టింది. ఇదే మనోడికి కాస్త కోపాన్ని తెప్పించింది. ఎలాగైన సరే ప్రియురాలిపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే పక్కా స్కెచ్ వేసి ఆ యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భారత్ కు చెందిన జాస్మిన్ కౌర్ (21) నర్సింగ్ చదువుకోవడానికి గతంలో ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడే ఆమెకు తారిక్ జోత్ సింగ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వీరి ప్రేమాయణం అలా కొన్ని రోజులు గడిచింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలోనే ప్రియుడు తారిక్ జోత్ సింగ్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.

ప్రతీ చిన్న విషయానికి గొడవ పడి ప్రియురాలిని తిట్టడం, కొట్టడం చేసేవాడు. ప్రియురాలు జాస్మిన్ కౌర్ ప్రియుడి టార్చర్ ను కొన్ని రోజులు భరించింది. కానీ, రాను రాను అతడు రాక్షసుడిలా మారిపోయాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి.. ప్రియుడిని కాస్త దూరం పెట్టింది. ఇది ఆమె ప్రియుడికి అస్సలు నచ్చలేదు. ఇదే విషయమై ఇద్దరు తరుచు గొడవ పడేవారు. జాస్మిన్ పై ఆ యువకుడి కోపం మరింత పెరిగింది. ఇలా అయితే కాదని భావించిన ఆ యువకుడు.. ఎలాగైన ప్రియురాలు జాస్మిన్ ను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ గీశాడు.

అది 2021, మార్చి నెల. తారిక్ జోత్ ఆమె పని చేసే చోటుకు వెళ్లి జాస్మిన్ ను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బలవంతంగా ఆమెను కారులో ఫ్లిండర్స్ రేంజ్ కు తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక.. తారిక్ జోత్ సింగ్ ప్రియురాలి కళ్లకు గంతలు కట్టి.. ఆమె చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేశాడు. అనంతరం ఆమెను సజీవ సమాధి చేసి చేతులు దులుపుకున్నాడు. ఇక కూతురు గురించి ఎలాంటి సమాచారం దొరక్కపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని రోజుల పాటు గాలించారు. కానీ, చివరికి జాస్మిన్ కౌర్ ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైందని పోలీసులు తెలుసుకున్నారు. అయితే, గత కొన్ని నెలల కిందటే నిందితుడు తారిక్ జోత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బుధవారం వాదనలు విన్న కోర్టు.. నిందితుడు తారిక్ జోత్ సింగ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show comments