iDreamPost
android-app
ios-app

హౌస్ ఫుల్ బోర్డులు.. అంతా ‘కుభేర’ దయ

  • Published Jun 21, 2025 | 11:10 AM Updated Updated Jun 21, 2025 | 11:10 AM

Kubhera Movie: ఒకప్పుడు మూవీస్ కి క్రేజి సీజన్ గా చెప్పుకునే సమ్మర్ లో ఈసారి అసలు సినిమాలే లేక థియేటర్స్ వెలవెలబోయాయి. హిట్ 3, సింగిల్ సినిమాల తర్వాత నెల రోజులు బాక్స్ ఆఫీస్ చప్పపడిపోయింది. కానీ ఇప్పుడు కుభేర పుణ్యమా అని మళ్ళీ థియేటర్స్ కళకళాడుతున్నాయి. నిజానికి కొద్దిరోజుల ముందు వరకు కూడా కుభేరకు అంత బజ్ లేదు. వర్కౌట్ అవుతుందా అవ్వదా ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

Kubhera Movie: ఒకప్పుడు మూవీస్ కి క్రేజి సీజన్ గా చెప్పుకునే సమ్మర్ లో ఈసారి అసలు సినిమాలే లేక థియేటర్స్ వెలవెలబోయాయి. హిట్ 3, సింగిల్ సినిమాల తర్వాత నెల రోజులు బాక్స్ ఆఫీస్ చప్పపడిపోయింది. కానీ ఇప్పుడు కుభేర పుణ్యమా అని మళ్ళీ థియేటర్స్ కళకళాడుతున్నాయి. నిజానికి కొద్దిరోజుల ముందు వరకు కూడా కుభేరకు అంత బజ్ లేదు. వర్కౌట్ అవుతుందా అవ్వదా ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

  • Published Jun 21, 2025 | 11:10 AMUpdated Jun 21, 2025 | 11:10 AM
హౌస్ ఫుల్ బోర్డులు.. అంతా ‘కుభేర’ దయ

తెలుగు ప్రేక్షకులను సినిమా అంటే ఎదో మూడు గంటలు తెర మీద కనిపించే బొమ్మ కాదు. అది ఒక ఎమోషన్.. మనసుకు హత్తుకునే సినిమా తెరమీద పడిందంటే దానిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అలాంటి ఓ మంచి సినిమా కోసం ఎప్పటినుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని కుభేరతో ప్రూవ్ అయిపొయింది. అలా మొదటి షో పడిందో లేదో పాజిటివ్ టాక్స్ పాదరసంలా పాకిపోయి.. సాయంత్రానికి థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ ప్రత్యేక్షమయ్యాయి. దీనిని చూసి ఎగ్జిబిటర్లు తెగ మురిసిపోతున్నారు. ఎడారిలో చుక్క నీరు కూడా దొరకని వాడికి ఓల్డ్ మాంక్ దొరికినంత హ్యాపీ అయిపోతున్నారు. అంతా ఆ కుభేరుడు దయ.

ఎందుకంటే ప్రస్తుతం థియేటర్స్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారిపోతుంది. సరైన సినిమాలు లేక ఓటిటి లలో కంటెంట్ పెరిగిపోయి.. థియేటర్ వరకు ఏమి వెళ్తామలే అనే స్టేజ్ కు వచ్చేస్తున్నారు జనాలు. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలకు సైతం ఓపెనింగ్స్ కరువైపోవడం గమనార్హం. ఒకప్పుడు మూవీస్ కి క్రేజి సీజన్ గా చెప్పుకునే సమ్మర్ లో ఈసారి అసలు సినిమాలే లేక థియేటర్స్ వెలవెలబోయాయి. హిట్ 3, సింగిల్ సినిమాల తర్వాత నెల రోజులు బాక్స్ ఆఫీస్ చప్పపడిపోయింది. కానీ ఇప్పుడు కుభేర పుణ్యమా అని మళ్ళీ థియేటర్స్ కళకళాడుతున్నాయి.

ఓ మంచి సినిమా చూసి ఆదరిద్దామని ప్రేక్షకుడికి ఉన్నా.. వారి ఆశ తీర్చే సినిమా లేక ఊసూరుమనే పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇలాంటి టైం లో శేఖర్ కమ్ముల గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరి ఆకలి తీర్చెసాడు. నిజానికి కొద్దిరోజుల ముందు వరకు కూడా కుభేరకు అంత బజ్ లేదు. వర్కౌట్ అవుతుందా అవ్వదా ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మొదటి షో నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో మొత్తం ఇండస్ట్రీ ఖుషి అయిపోయింది. లెక్కల సంగతి ఇప్పుడే ఏమి చెప్పలేం కానీ కచ్చితంగా మూవీ ధనుష్, నాగార్జున , శేఖర్ కమ్ముల కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş