iDreamPost
android-app
ios-app

తెలుగు డైరెక్టర్స్ Vs తమిళ్ డైరెక్టర్స్… ఇలా అయితే ఎలా !

  • Published Jun 21, 2025 | 3:08 PM Updated Updated Jun 21, 2025 | 3:08 PM

ఏ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేసిన చేసిన ఫైనల్ గా అయితే కోరుకునేది సినిమా హిట్ అవ్వాలని అంతే. కానీ మన దర్శకులేమో తమిళ హీరోలకు హిట్ లు అందిస్తుంటే. తమిళ డైరెక్టర్లు మన హీరోలకు ప్లాపులు ఇస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బజ్ బాగా వైరల్ అవుతుంది.

ఏ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేసిన చేసిన ఫైనల్ గా అయితే కోరుకునేది సినిమా హిట్ అవ్వాలని అంతే. కానీ మన దర్శకులేమో తమిళ హీరోలకు హిట్ లు అందిస్తుంటే. తమిళ డైరెక్టర్లు మన హీరోలకు ప్లాపులు ఇస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బజ్ బాగా వైరల్ అవుతుంది.

  • Published Jun 21, 2025 | 3:08 PMUpdated Jun 21, 2025 | 3:08 PM
తెలుగు డైరెక్టర్స్  Vs తమిళ్ డైరెక్టర్స్… ఇలా అయితే ఎలా !

ఏ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేసిన చేసిన ఫైనల్ గా అయితే కోరుకునేది సినిమా హిట్ అవ్వాలని అంతే. కానీ మన దర్శకులేమో తమిళ హీరోలకు హిట్ లు అందిస్తుంటే. తమిళ డైరెక్టర్లు మన హీరోలకు ప్లాపులు ఇస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బజ్ బాగా వైరల్ అవుతుంది. అసలు ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఎందుకు వచ్చాయంటే.. ప్రస్తుతం కుభేర మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియనిది కాదు. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ కి హిట్ అవ్వడంతో.. మూవీ లవర్స్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేసుకుంటున్నారు.

ధనుష్ తో శేఖర్ కమ్ముల మూవీ అనౌన్స్ చేసినప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే అక్కడ శేఖర్ కమ్ముల అంత పరిచయం లేదు. కానీ ఒన్స్ మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్స్ కు జనాలు క్యూ కడుతున్నారు. గతంలో ధనుష్ హిట్ అందుకున్న సార్ మూవీకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా ఉన్నది తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరినే. ఇవే కాదు దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ , ఇప్పుడు సూర్య 47 కూడా చేసేది ఈ దర్శకుడే. ఇలా చెప్పుకుంటే పోతే మన దర్శకులు తమిళ హీరోలకు తెలుగు దర్శకులు మంచి హిట్స్ ఏ అందించారు. కానీ మన విషయానికొస్తే

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తీసిని శంకర్. ఇది చరణ్ అభిమానులను ఎంత బాధపెట్టిందో వారికే తెలుసు. మహేష్ ఫ్యాన్స్ కు పీడకల లాంటి సినిమా స్పైడర్ , రామ్ ది వారియర్ మూవీ దర్శకుడు లింగుస్వామి. వీరంత ఎక్కడివారో తెలియనిది కాదు. ఇలా ప్రస్తుతం పాత సినిమాలను డైరెక్టర్స్ లిస్ట్ అవుట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రతి దర్శకుడు ప్రతి హీరోతో చేసే సినిమా హిట్ అవ్వాలని రూల్ లేదు కానీ.. మన దర్శకులు వారికి సూపర్ హిట్ లు అందిస్తున్నప్పుడు… వారి నుంచి కనీసం హిట్ ఆశించడంలో తప్పేముంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా మన హీరోలు ఆచి తూచి అడుగులు వేస్తారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.