iDreamPost
android-app
ios-app

శేఖర్ కమ్ముల మాత్రమే ఇలా చేయగలడు..

  • Published Jun 21, 2025 | 4:01 PM Updated Updated Jun 21, 2025 | 4:01 PM

న మరో వెర్షన్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ , మాస్ మసాలా ఇవేమి లేకపోయినా సరే వీటి అన్నిటిని మరిపించేలా కథను అద్భుతంగా ముందుకు తీసుకునివెళ్ళాడు. వీటి అన్నిటిని బ్యాలెన్స్ చేయడంలోనే శేఖర్ కమ్ముల సగం సక్సెస్ అయ్యాడు. ఇవన్నీ కేవలం ఈ దర్శకుడు మాత్రమే చేయగలడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మూవీ నిడివి విషయంలో కాస్త నెగెటివ్ టాక్ వస్తున్న మాట వాస్తవమే. ఇదే విషయం శేఖర్ కమ్ములను అడిగితే..

న మరో వెర్షన్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ , మాస్ మసాలా ఇవేమి లేకపోయినా సరే వీటి అన్నిటిని మరిపించేలా కథను అద్భుతంగా ముందుకు తీసుకునివెళ్ళాడు. వీటి అన్నిటిని బ్యాలెన్స్ చేయడంలోనే శేఖర్ కమ్ముల సగం సక్సెస్ అయ్యాడు. ఇవన్నీ కేవలం ఈ దర్శకుడు మాత్రమే చేయగలడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మూవీ నిడివి విషయంలో కాస్త నెగెటివ్ టాక్ వస్తున్న మాట వాస్తవమే. ఇదే విషయం శేఖర్ కమ్ములను అడిగితే..

  • Published Jun 21, 2025 | 4:01 PMUpdated Jun 21, 2025 | 4:01 PM
శేఖర్ కమ్ముల మాత్రమే ఇలా చేయగలడు..

ప్రస్తుతం కుభేర సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. అసలు ఇది శేఖర్ కమ్ముల సినిమానేనా అనే డౌట్ రాకుండా పోదు. ధనుష్ , రష్మిక లాంటి కాంబినేషన్ పెట్టుకుని కూడా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ సన్నివేశాలు రాయలేదు. ఇక నాగార్జున విషయానికొస్తే.. ఇలాంటి వెర్సటైల్ క్యారెక్టర్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇవ్వొచ్చు. కానీ ఓ మిడిల్ క్లాస్ మ్యాన్ లా చూపించి కూడా అందరు ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇక నాగార్జున , ధనుష్ క్యారెక్టర్స్ తో సమానంగా ట్రావెల్ చేసిన విలన్ విషయానికొస్తే.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికేశాడని అంతా అంటున్నారు.

వాస్తవానికి అసలు శేఖర్ కమ్ముల సినిమాలలో విలన్ పాత్రలకు చోటు ఉండదు. గోదావరి , హ్యాపీ డేస్ , లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , ఫిదా లాంటి సినిమాలలో అయితే విలన్ కాదు కదా అసలు ఆ ఛాయలు కూడా కనిపించవు. కానీ ఇప్పుడు ఈ సినిమాలో విలన్ రోల్ ను కూడా చాలా అందంగా చూపించి.తన మరో వెర్షన్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ , మాస్ మసాలా ఇవేమి లేకపోయినా సరే వీటి అన్నిటిని మరిపించేలా కథను అద్భుతంగా ముందుకు తీసుకునివెళ్ళాడు. వీటి అన్నిటిని బ్యాలెన్స్ చేయడంలోనే శేఖర్ కమ్ముల సగం సక్సెస్ అయ్యాడు.

ఇవన్నీ కేవలం ఈ దర్శకుడు మాత్రమే చేయగలడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మూవీ నిడివి విషయంలో కాస్త నెగెటివ్ టాక్ వస్తున్న మాట వాస్తవమే. ఇదే విషయం శేఖర్ కమ్ములను అడిగితే.. తానూ ఈ సినిమాను చాలా లేయర్స్ గా రాసుకున్నని. ఆలస్యం అయినా నిజాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పాలనుకున్నానని.. మరోసారి ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఇంకో లేయర్ కొత్తగా అనిపించే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పటివరకు శేఖర్ కమ్ముల తీసిన సినిమాలలో కుబేర వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet