iDreamPost
android-app
ios-app

కన్నప్పను లైన్ క్లియర్ అయినట్లే..

  • Published Jun 21, 2025 | 2:01 PM Updated Updated Jun 21, 2025 | 2:01 PM

సినిమాలు లేక మూగపోయిన థియేటర్స్ ఒక్కసారిగా దద్దరిల్లుతున్నాయి. దీనికి కారణం కుభేర. ప్రస్తుతం కుభేర టాలీవుడ్ బరువు బాధ్యతలను మోస్తుంది. థియేటర్ ఓనర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ , ప్రేక్షకులు అంతా ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ కాకముందు ఏమౌతుందా అనే టెన్షన్ అందరిలో కనిపించింది.

సినిమాలు లేక మూగపోయిన థియేటర్స్ ఒక్కసారిగా దద్దరిల్లుతున్నాయి. దీనికి కారణం కుభేర. ప్రస్తుతం కుభేర టాలీవుడ్ బరువు బాధ్యతలను మోస్తుంది. థియేటర్ ఓనర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ , ప్రేక్షకులు అంతా ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ కాకముందు ఏమౌతుందా అనే టెన్షన్ అందరిలో కనిపించింది.

  • Published Jun 21, 2025 | 2:01 PMUpdated Jun 21, 2025 | 2:01 PM
కన్నప్పను లైన్ క్లియర్ అయినట్లే..

సినిమాలు లేక మూగపోయిన థియేటర్స్ ఒక్కసారిగా దద్దరిల్లుతున్నాయి. దీనికి కారణం కుభేర. ప్రస్తుతం కుభేర టాలీవుడ్ బరువు బాధ్యతలను మోస్తుంది. థియేటర్ ఓనర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ , ప్రేక్షకులు అంతా ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ కాకముందు ఏమౌతుందా అనే టెన్షన్ అందరిలో కనిపించింది. కానీ మొదటి షో పడగానే అందరి అనుమానాలు , భయాలు పటా పంచలయ్యాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కన్నప్పను దక్కే ప్లస్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇంకో వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. ఇది మంచు విష్ణుకే కాదు టాలీవుడ్ లోనే చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్.

దీనితో విష్ణు చాలా పకడ్బందీగా ముందు నుంచే మూవీని జనాల్లోకి తీసుకుని వెళ్లడం స్టార్ట్ చేశాడు. దుబాయ్ కి వెళ్లి మరి ఈవెంట్ ను చేసారు. ఇంకా ఈరోజు హైదరాబాద్ లో కూడా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే… కుభేరకు ప్రస్తుతం వస్తున్న స్పందన కన్నప్పను కొత్త ఉత్సాహాన్ని అందించేలా ఉంది. ఎందుకంటే కొన్ని వారాలుగా ఏ సినిమాలు లేకపోవడంతో ఇళ్లకే పరిమితం అయ్యారు ప్రేక్షకులు. అసలు జనం థియేటర్స్ కు వస్తారా లేదా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కుభేర థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి సినిమా కంటెంట్ నచ్చితే ఆటోమాటిక్ గా ప్రేక్షకులు థియేటర్స్ వద్ద బారులు తీరుతారని క్లియర్ గా తెలిసింది.

సో ప్రస్తుతం కన్నప్ప విషయంలో పాజిటివ్ టాక్ ఏ నడుస్తుంది. ట్రైలర్ కూడా ఎలాంటి ట్రోల్స్ కు గురికాకుండా డీసెంట్ రెస్పాన్స్ ను సంపాదించుకుంది. ఇక జూన్ 27 మొదటి షో పడ్డాక కూడా ఇదే రేంజ్ టాక్ నడిస్తే మాత్రం.. కన్నప్ప గట్టెక్కినట్టే. కుభేర రెగ్యులర్ మాస్ సినిమా కాకపోయినా .. నిడివి ఎక్కువ ఉన్నా సరే ప్రేక్షకులు దానిని ఆదరించిన తీరు చాలు.. కన్నప్పకు కూడా ఇదే రేంజ్ లో హిట్ అందిస్తారని అర్ధమౌతుంది. ప్రస్తుతం వీలైనంత వరకు కన్నప్పకు మంచి డివోషనల్ మూవీగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler