ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుని నరకం చూపాడు.. చివరకు

ప్రేమ పేరుతో వేదించాడు.. బెదిరించి మరీ వివాహం చేసుకున్నాడు. ఆపై ఆమెకి నరకం చూపాడు. దాంతో ఆమె దారుణ నిర్ణయం తసీఉకుంది. ఆ వివరాలు..

ప్రేమ పేరుతో వేదించాడు.. బెదిరించి మరీ వివాహం చేసుకున్నాడు. ఆపై ఆమెకి నరకం చూపాడు. దాంతో ఆమె దారుణ నిర్ణయం తసీఉకుంది. ఆ వివరాలు..

ప్రేమిస్తున్నాను అన్నాడు.. నువ్వులేకపోతే బతకలేనని నమ్మించాడు.. అతడి మాయమాటలు నమ్మిన యువతి.. పెద్దలకు తెలియకుండ గుడిలో అతడిని వివాహం చేసుకుంది. ప్రేమించిన వాడి కోసం కన్నవారిని సైతం వదులకుని వచ్చిన భార్యను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. ఆమెను దారుణంగా హింసించాడు. అది కూడా పెళ్లైన మరసటి రోజు నుంచే. ప్రేమించే సమయంలో నువ్వే లోకం అన్న వ్యక్తి.. వివాహం తర్వాత.. ఆమెను కట్నం కోసం వేధించాడు. అనుమానించాడు.. అవమానించాడు. అతడి టార్చర్‌ను తట్టుకోలేకపోయిన సదరు మహిళ.. పెళ్లైన ఏడాదికే దారుణం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఓ యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి, పెళ్లి చేసుకున్న తర్వాత అత్యంత కిరాతకంగా వేధింపులకు గురి చేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌, ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడైన మృతురాలి భర్త సాయి రాఘవేంద్ర.. ఆమె ఆత్మహత్యకు కారణం కావడం మాత్రమే కాక.. రాజకీయ అండ చూసుకుని.. అత్తమామలని భయపెడుతున్నాడని.. అతడిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో దళిత నాయకులు నీలం నాగేంద్రరావు, చప్పిడి వెంగళరావు, దారా అంజయ్య, కేరళ దిలీప్‌ తదితరులు సోమవారం తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డిని కలిసి మాట్లాడారు.

అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన దాని ప్రకారం.. స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన దళిత యువతి లింగతోటి తులసిని.. సాయి రాఘవేంద్ర ప్రేమ పేరుతో వేధించేవాడు. అంతటితో ఆగక.. ఆమెని బెదిరించి.. గత ఏడాది ఫిబ్రవరి 5న గుడిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన మరుసటి రోజు నుంచే ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఈ ఏడాది కాలంలో ఆమెకు నరకం చూపించాడు. వివాహం అనంతరం తులసిని శారీరకంగా, మానసికంగా వేధించడమేకాక.. రూ.10 లక్షల కట్నం తీసుకురావాలంటూ కొట్టి పుట్టింటికి తరిమేశాడు.

ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ.. దామచర్ల అనుచరునిగా చలామణి అయ్యే సాయి.. అత్తమామలు కట్నం ఇవ్వకపోవడంతో.. వారి ఇంటికి మీదకు వెళ్లి గొడ్డలితో చంపుతానని బెదిరించాడు. దాంతో అతడిపై తాలూకా పోలీసులు రౌడీషీట్‌ కూడా ఓపెన్‌చేశారు. ఇక ఇటీవల తులసి బంధువుల ఒకరు అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతుండంతో వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. బంధువుల మోటారు సైకిల్‌పై తులసి హస్పిటల్‌కి వెళ్లడం గమనించిన సాయి అత్తగారింటి వద్దకు వచ్చి.. ఆమెతో గొడవపడ్డాడు.

తులసిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడమేకాక.. అడ్డువచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులపై హత్యాయత్నం చేశాడు. భర్త ప్రవర్తనతో తీవ్రంగా మనస్తాపం చెందిన తులసి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందన్నారు. ప్రేమించానని వేధించి.. ఆపై వివాహం చేసుకొని ఆమెకు నరకం చూపి.. చివరకు ఆత్మహత్యకు కారణమైన సాయిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Show comments