Swetha
ఈ మధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో ఇలానే జరుగుతుంది. సినిమా థియేటర్ లో రిలీజ్ కాకముందే OTT హక్కులు , శాటిలైట్ హక్కులు అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి భైరవం మూవీ కూడా యాడ్ అయింది.
ఈ మధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో ఇలానే జరుగుతుంది. సినిమా థియేటర్ లో రిలీజ్ కాకముందే OTT హక్కులు , శాటిలైట్ హక్కులు అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి భైరవం మూవీ కూడా యాడ్ అయింది.
Swetha
మొన్న రిలీజ్ చేసిన భైరవం ట్రైలర్ తో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. బెల్లం కొండ శ్రీనివాస్ , నారా రోహిత్ , మంచి మనోజ్ ముగ్గురు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ ముగ్గురు నుంచి ఈ మధ్య కాలంలో సరైన కథలు రాలేదు. దీనితో ఈ మూవీ వీరికి మంచి కంబ్యాక్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు. ఈ సినిమాను మే 30 న థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ఆ వివరాలు చూసేద్దాం.
భైరవం మూవీ OTT హక్కులు మంచి ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా OTT రైట్స్ ను ప్రముఖ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకుందట. అలాగే శాటిలైట్ హక్కులను జీ తెలుగు టివి సొంతం చేసుకున్నట్లు సమాచారం. సో నాన్ థియేట్రికల్ రైట్స్ ను జీ సంస్థ సొంతం చేసుకుంది. డిజిటల్ , శాటిలైట్ హక్కులు మొత్తం కలిపి సుమారు రూ.32కోట్లకు జీ సంస్థ దక్కించుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా తమిళ మూవీ గరుడన్ ఆధారంగా తెరకెక్కింది. కాంతార కు మించిన వైబ్ ఈ సినిమాలో కనిపిస్తుందని మూవీ టీం అంటున్నారు. ఒకవేళ అనుకున్నట్లుగా మూవీ కనుక సక్సెస్ అయితే ఒకే సినిమాతో ముగ్గురు హీరోలు కంబ్యాక్ ఇచ్చినట్లే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.