అక్క మృతి, చెల్లెలి పరారీ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్!

కోరుట్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దీప్తి మృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అక్క దీప్తి, చెల్లెలు చందన మద్యం సేవించారని తెలుస్తుంది. అనంతరం అదే రాత్రి ఇంట్లో నుంచి చెల్లెలు చందన వెళ్లిపోవడం, అక్క దీప్తి సోఫలో శవమై కనిపించడం చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురై గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి అదృశ్యం అయిన మృతురాలి చెల్లెలు చందన తమ్ముడికి బుధవారం వాయిస్ మెసేజ్ పంపింది. అందులో.. నేను అక్కను చంపలేదని, నాకేం తెలియదంటూ తెలపింది. ఇదే ఆడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. పోస్ట్ మార్టంలో భాగంగా వైద్యులు దీప్తి మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె ఒంటిపై గాయాలైనట్లుగా గుర్తించారు. దీంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలకు తావు దొరికినట్లు అవుతోంది.

ఈ క్రమంలోనే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బంక శ్రీనివాస్ రెడ్డి (దీప్తి తండ్రి) ఇంట్లో నుంచి 50 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు మాయమైనట్లు సమచారం. అయితే చందన గత కొంత కాలం నుంచి తన క్లాస్ మెట్ తో సన్నిహితంగా ఉంటుందని, అతనితో సోమవారం రాత్రి వెళ్లిపోయినట్లు సమయంలోనే ఇంట్లోని నగదు, బంగారు అభరణాలు తీసుకెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు చందనను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఇక చందన ఆచూకి దొరికితే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Show comments