బరితెగించిన కాల్వ అనుచరుడు.. యువతిపై లైంగికదాడికి దిగిన దుండగుడు!

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ నేత కాల్వ శ్రీనివాసు అనుచరుడు ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. ఇక బాధితురాలు జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హులికల్లుకు గ్రామానికి చెందిన బోయ సోమశేఖర్ (45) ( టీడీపీ నేత కాల్వ శ్రీనివాసుకు ప్రధాన అనుచరుడు) వరుసకు కోడలైన ఓ యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇతగాడు ఈ అమ్మాయిపై ఎప్పటి నుంచో ఓ కన్నేసి ఉంచాడు. ఎలాగైన కోరిక తీర్చుకోవాలని భావించాడు. ఇక సమయం కోసం ఎదురు చూశాడు.

ఇందులో భాగంగానే సోమవారం ఆ అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమశేఖర్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత బలవంతంగా ఆ అమ్మాయిపై లైంగిక దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత సోమశేఖర్ అక్కడి నుంచి పారిపోయాడు. జరిగింది తలుచుకుంటూ ఆ యువతి ఏడుస్తూ ఇంట్లో కూర్చింది. అదే సమయానికి ఆమె తల్లిదండ్రులు రావడంతో జరిగిందంతా వివరించింది. కోపంతో ఊగిపోయిన బాధిత యువతి బంధువులు, కుటుంబ సభ్యులు నిందితుడు సోమశేఖర్ పై దాడికి దిగారు. అనంతరం ఆ యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేపి రిమాండ్ కు తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Show comments