పండగ సెలవుల్లో ఇంటికొచ్చారు.. పాపం, బతుకమ్మ వేడుకలకు వెళ్తూ..!

పండగ సెలవుల్లో సొంతూర్లకు వెళ్లారు. బతుకమ్మ, దసరా పండగలను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడపాలని అనుకున్నారు. కానీ, ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే?

పండగ సెలవుల్లో సొంతూర్లకు వెళ్లారు. బతుకమ్మ, దసరా పండగలను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడపాలని అనుకున్నారు. కానీ, ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే?

పండగ సెలవుల్లో అందరితో పాటు వీళ్లు కూడా సొంతూర్లకు వెళ్లారు. బతుకమ్మ, దసరా పండగలను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడపాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి స్కూటీపై బతుకమ్మ వేడుకలను చూడాలని వెళ్లారు. పాపం, ఊహించని ప్రమాదంలో ఈ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకుని ఇరువురి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. పండగ పూట ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో వీరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన గంగన్న అనే వ్యక్తి తన కూతురైన రాహిత్య (15)ను బైక్ పై ఎక్కించుకుని బంధువైన సాగర్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత వారి కుమార్తెను సాత్వికను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బతకమ్మను చూసేందుకు ముగ్గురు వెళ్లారు. అయితే వీళ్లు చెక్కపెల్లికుంట వద్ద వెళ్తుండగా వీరి బైక్ ను ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాహిత్య, సాత్వికతో పాటు గంగన్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో సాత్విక, రాహిత్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

గంగన్న ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. వీరి మరణవార్త తెలుసుకుని ఇరువురి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన సాత్విక నీట్ కోచింగ్ తీసుకుంటుండగా, రాహిత్య మాత్రం పదవ తరగతి చదువుతోంది. ఈ సెలవుల్లో ఇంటికి వచ్చి మృత్యువాత పడడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Show comments