iDreamPost
android-app
ios-app

హైదరాబాద్: 2 లక్షలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి!

ACB Officials Caught Commercial TAX Officer In Hyderabad: అవినీతి నిరోధక శాఖ అధికారులకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

ACB Officials Caught Commercial TAX Officer In Hyderabad: అవినీతి నిరోధక శాఖ అధికారులకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

హైదరాబాద్: 2 లక్షలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అధికారి!

అధికారులు ఎంత నిజాయతీగా ఉన్నా కూడా.. కొందరు మాత్రం ఇలా లంచాలకు అలవాటు పడి అధికారుల పరువు తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక అధికారి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పన్నుల శాఖలో పనిచేస్తున్న ఈయన ఒక కంపెనీకి సంబంధించి లెక్కలు సరిచూసేందుకు రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే సదరు కంపెనీ యజమానికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ అధికారిని ఏసీబీకి పట్టించాడు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏసీబీ అధికారులకు చిక్కింది.. పంజాగుట్ట సర్కిల్ 1, హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారే. ఆయన పేరు శ్రీధర్ రెడ్డి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఆడిట్ ని పూర్తి చేసేందుకు ఈ లంచం డిమాండ్ చేశారు. అలాగే అదే కంపెనీకి చెందిన గతంలో ఇచ్చిన నోటీసును మూసేయడానికి కూడా ఈ లంచం మొత్తాన్ని కోరాడంట. ఉప్పల్ కు చెందిన శ్రీకాంత్ కు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. అయితే ఆయన తన సంస్థకు సంబంధించి మూడేళ్లకు గాను ఆస్తులను లెక్కించేందుకు శ్రీధర్ కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే శ్రీధర్ మాత్రం డ్రాఫ్ట్ లో ఏవో తప్పులు ఉన్నాయి అంటూ రిజెక్ట్ చేశాడంట.

శ్రీధర్ పంపిన షోకాజ్ నోటీసులకు గాను.. శ్రీకాంత్ అంతా సరిగ్గానే ఉందని.. సరైన పత్రాలు జోడించినట్లు వెల్లడించాడు. కానీ, శ్రీధర్ మాత్రం ఆడిట్ చేయాలి అంటే రూ.3 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడం. చివరకు ఆ బేరాన్ని రూ.2 లక్షలకు తెగ్గొట్టారు. కానీ, శ్రీకాంత్ కు ఆ మొత్తాన్ని లంచంగా ఇవ్వడం ఇష్టం లేదంట. అందుకే శ్రీధర్ విషయాన్ని, అతను లంచం డిమాండ్ చేసిన సంగతిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అబిడ్స్ లో ఉన్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో శ్రీధర్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. అధికారి శ్రీధర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే ఆ అధికారిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏసీబీ వలలో చిక్కిన శ్రీధర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.