iDreamPost
android-app
ios-app

బిలీనియర్ కామాంధుడు .. 60 మంది ఉద్యోగినులపై పైశాచికత్వం

ఇప్పుడిప్పుడే తమకు జరుగుతున్న అన్యాయం గురించి మహిళలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీటూ ఉద్యమం స్పూర్తిగా తీసుకుని తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బహిరంగంగా చర్చిస్తున్నారు. అయినప్పటికీ దారుణాలు ఆగడం లేదు. తాజాగా..

ఇప్పుడిప్పుడే తమకు జరుగుతున్న అన్యాయం గురించి మహిళలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీటూ ఉద్యమం స్పూర్తిగా తీసుకుని తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బహిరంగంగా చర్చిస్తున్నారు. అయినప్పటికీ దారుణాలు ఆగడం లేదు. తాజాగా..

బిలీనియర్ కామాంధుడు .. 60 మంది ఉద్యోగినులపై పైశాచికత్వం

ఆకాశంలో సగం, అవనిలో సగమంటూ మహిళను పొగిడేస్తున్నారు. ఇది కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితమౌతోంది. వాస్తవంలో ఆమెను ఓ ఆటబొమ్మగా, సెక్సీ టాయ్‌గా చూస్తున్నారు కామాంధులు. ఇంట, బయటనే తేడా లేకుండా లైంగిక దోపీడికి గురౌతున్నారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో. తమ కాళ్లపై తాము నిలబడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలబడాలని వంటగదిని వీడి బయటకు వస్తున్న ఎంతో మంది మహిళల్ని కాలరాస్తున్నారు యాజమానులు. తాజాగా ఓ బిలీనియర్ చీకటి బాగోతం బయటకు వచ్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలపై పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. తన సంస్థలో పని చేసే ఎంతో మంది మహిళా ఉద్యోగులపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఇటీవల బీబీసీ వార్తా కథనం పేర్కొంది.

బ్రిటన్‌లో ప్రముఖ లగ్జరీ డిపార్ట్ మెంట్ స్టోర్ హారోడ్స్ సంస్థ మాజీ యజమాని మహ్మద్ అల్ ఫయాద్.. 1985 నుండి 2010 వరకు తన కంపెనీలో పని చేసే అనేక మంది ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే అతడిపై చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమైంది. ఫయాద్ రాసలీలల గురించి బీబీసీ దీనిపై డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. దీంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సుమారు 60 మంది మహిళలు బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. స్టోర్ అధినేతగా ఉన్న సమయంలోనే ఈ దారుణాలకు ఒడిగట్టినట్లు బాధితులు వెల్లడించారని వారి తరుఫున న్యాయవాదులు చెబుతున్నారు. తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. సీనియర్ సెక్యూరిటీ సిబ్బంది బెదిరించేవారట.. దీంతో ఏమీ చేయలేక.. ఉద్యోగం విడిచి పెట్టడం తప్ప వారికి మరో మార్గం కనిపించలేదు.

అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 150 మందికి పైగా మహిళలు ఇటువంటి ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో 60 మంది మాత్రమే కోర్టును ఆశ్రయించారు.  ఇవే కాదు.. 2008లో  మైనర్ బాలికపై  లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) 2009లో సాక్ష్యాలను సమీక్షించింది. 2013లో, అతను ఒక మహిళపై అత్యాచారం చేశాడని అలగేషన్స్ రాగా, విచారణ జరిగింది. కానీ అప్పటి నుండి దొరకకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు.ఇందులో విచారకరమైన అంశం ఏంటంటే..? బాధితులు బయటకు వచ్చినప్పటికీ.. ఈ శిక్ష అనుభవించేందుకు నిందితుడు బతికి లేకపోవడం. గత ఏడాది ఈ బిలియన్ మరణించాడు. బతికి ఉండగా.. ఆయన వ్యవహారం బయటకు రాలేదు. చనిపోయాక పెద్ద సంఖ్యలో దారుణాలు వెలుగు చూశాయి. 2010లో ఆ హారోడ్స్ సంస్థను ఖతార్‌కు చెందిన ఓ కంపెనీ టేకోవర్ చేసుకుంది. తాజాగా ఈ పరిణమాలు వెలుగు చూడటంతో సదరు సంస్థ యాజమాన్యం క్షమాపణలతో సరిపెట్టేసింది. ఆయన లైంగిక ఆరోపణలు తమకు తెలియదని చెప్పుకొచ్చింది. వర్కింగ్ ప్లేసులో జరుగుతున్న ఈ దారుణాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.