జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్: ఎందులో సరుకుల ధర తక్కువంటే?

Sswiggy Instamart, vs Zepto vs Blinkit Cheapest Grocery: ఆన్ లైన్ లో కిరాణా సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? స్విగ్గీ ఇన్ స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో వంటి వాటిలో డైలీ కొనే పాలు, పెరుగు, ఉల్లిపాయలు వంటి సరుకుల ధరలు ఎలా ఉన్నాయో చూడండి. వీటిలో ఎందులో తక్కువ ధర పడుతుందో చూడండి.

Sswiggy Instamart, vs Zepto vs Blinkit Cheapest Grocery: ఆన్ లైన్ లో కిరాణా సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? స్విగ్గీ ఇన్ స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో వంటి వాటిలో డైలీ కొనే పాలు, పెరుగు, ఉల్లిపాయలు వంటి సరుకుల ధరలు ఎలా ఉన్నాయో చూడండి. వీటిలో ఎందులో తక్కువ ధర పడుతుందో చూడండి.

ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే కిరాణా సరుకులు ఆర్డర్ చేసుకుంటున్నారు. వర్షాకాలంలో అయితే బురదలో కాలు బయటపెట్టే అవసరం లేకుండా ఆయా గ్రోసరీ డెలివరీ యాప్స్ నిమిషాల్లోనే హోమ్ డెలివరీ చేసేస్తున్నాయి. కిరాణా షాపుకి వెళ్లి సరుకులు తెచ్చుకునే శ్రమ, సమయం తగ్గిపోతుండడంతో దాదాపు చాలా మంది ఈ యాప్స్ మీదనే ఆధారపడిపోయారు. పైగా డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వస్తుండడంతో ఆన్ లైన్ గ్రోసరీ యాప్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. పోటీ పడి మరీ ఆయా కంపెనీలు కస్టమర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. జెప్టో, స్విగ్గీ ఇన్ స్టామార్ట్, జొమాటోకి చెందిన బ్లింకిట్ వంటి యాప్స్ లో చాలా మంది సరుకులు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యాప్స్ లో గ్రోసరీ ఐటమ్స్ ధరలు ప్రస్తుతానికి ఎందులో తక్కువగా ఉన్నాయో తెలుసుకోండి. 

కిలో ఉల్లిపాయలు, కిలో టమాటాలు, కిలో బంగాళదుంపలు, అర లీటర్ పాలు, 500 గ్రాముల పెరుగు, 6 కోడి గుడ్లు, కిలో నెయ్యి, 5 కిలోల గోధుమపిండి, ఒక లీటర్ గోల్డ్ డ్రాప్ సన్ ఫ్లవర్ ఆయిల్ రేట్లు చూద్దాం. సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి 9.35 గంటల సమయానికి ఉన్న రేట్లు. తర్వాత మారే అవకాశం ఉండచ్చు. 

జెప్టో:

  • 475 నుంచి 525 గ్రాముల ఆర్గానిక్ ఉల్లిపాయలు: 73 రూపాయలు 
  • కిలో టమాటాలు: 81 రూపాయలు  
  • అర లీటర్ పాలు: 42 రూపాయలు
  • 500 గ్రాముల పెరుగు: 45 రూపాయలు
  • ఒక లీటర్ గోల్డ్ డ్రాప్ సన్ ఫ్లవర్ ఆయిల్: 109 రూపాయలు 
  • 6 కోడి గుడ్లు: 45 రూపాయలు
  • లీటర్ ఆవు నెయ్యి: 562 రూపాయలు 
  • 5 కిలోల గోధుమపిండి: 269 రూపాయలు 
  • మొత్తం బిల్లు: 1226 రూపాయలు  

బ్లింకిట్:

  • కిలో సాధారణ ఉల్లిపాయలు: 64 రూపాయలు 
  • కిలో టమాటాలు: 48 రూపాయలు  
  • అర లీటర్ పాలు: 31 రూపాయలు
  • 500 గ్రాముల పెరుగు: 45 రూపాయలు 
  • ఒక లీటర్ గోల్డ్ డ్రాప్ సన్ ఫ్లవర్ ఆయిల్: 110 రూపాయలు 
  • 6 కోడి గుడ్లు: 84 రూపాయలు
  • లీటర్ ఆవు నెయ్యి: 551 రూపాయలు 
  • 5 కిలోల గోధుమపిండి: 297 రూపాయలు 
  • మొత్తం బిల్లు: 1230 రూపాయలు  

స్విగ్గీ ఇన్ స్టామార్ట్:

  • కిలో ఆర్గానిక్ ఉల్లిపాయలు: 75 రూపాయలు 
  • కిలో టమాటాలు: 49 రూపాయలు  
  • అర లీటర్ పాలు: 31 రూపాయలు
  • 500 గ్రాముల పెరుగు: 45 రూపాయలు
  • ఒక లీటర్ గోల్డ్ డ్రాప్ సన్ ఫ్లవర్ ఆయిల్: 110 రూపాయలు 
  • 6 కోడి గుడ్లు: 46 రూపాయలు
  • లీటర్ ఆవు నెయ్యి: 567 రూపాయలు 
  • 5 కిలోల గోధుమపిండి: 355 రూపాయలు 
  • మొత్తం బిల్లు: 1278 రూపాయలు  

పై మూడు యాప్స్ లో తక్కువ ధరకే సరుకులు అందిస్తున్న యాప్ జెప్టో, ఆ తర్వాత బ్లింకిట్, ఆ తర్వాత స్విగ్గీ ఇన్ స్టామార్ట్ లు ఉన్నాయి. ఈ ధరలు అనేవి ఆయా సరుకుల కంపెనీలను బట్టి మారతాయి. తేదీలను బట్టి కూడా మారుతూ ఉంటాయి. మీ అవగాహన కోసం ఇవ్వబడిన సమాచారం మాత్రమే.

Show comments