Sukanya Samriddhi Yojana: మీ కూతురి భవిష్యత్ కోసం సూపర్ స్కీం.. నెలకు 5 వేల పెట్టుబడితో చేతికి 28 లక్షలు

మీ కూతురి భవిష్యత్ కోసం సూపర్ స్కీం.. నెలకు 5 వేల పెట్టుబడితో చేతికి 28 లక్షలు

Sukanya Samriddhi Yojana: ఆడపిల్ల పుట్టిందని దిగులు చెందుతున్నారా? కేంద్రం అందించే ఈ స్కీంలో పెట్టుబడి పెడితే లక్ష్మీదేవి పుట్టిందనుకోవాల్సిందే. ఈ పథకంలో నెలకు రూ. 5 వేల పెట్టుబడి పెడితే రూ. 28 లక్షలు పొందొచ్చు.

Sukanya Samriddhi Yojana: ఆడపిల్ల పుట్టిందని దిగులు చెందుతున్నారా? కేంద్రం అందించే ఈ స్కీంలో పెట్టుబడి పెడితే లక్ష్మీదేవి పుట్టిందనుకోవాల్సిందే. ఈ పథకంలో నెలకు రూ. 5 వేల పెట్టుబడి పెడితే రూ. 28 లక్షలు పొందొచ్చు.

ఆడపిల్లలు, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీంలను ప్రవేశపెడుతున్నది. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు మంచి స్మాల్ సేవింగ్ పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లల కోసం అద్భుతమైన స్కీంను అమలు చేస్తున్నది. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు భారం కాకూడదని కేంద్రం సుకన్య సమృద్ధియోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటే ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పథకంలో మీరు ప్రతి నెల రూ. 5 వేల పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ నాటికి చేతికి 28 లక్షల వరకు పొందొచ్చు.

సుకన్య సమృద్ధియోజన పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరిట ఖాతాలు ఓపెన్ చేయొచ్చు. ఒక వేళ రెండోసారి కలిగిన సంతానంలో కవల ఆడ పిల్లలు పుడితే అప్పుడు మూడో ఖాతా కూడా ప్రారంభించొచ్చు. ఈ స్కీంలో చేరాలంటే వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. సంవత్సరానికి కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అమ్మాయికి 21ఏళ్లు నిండాక ఆ మొత్తం సొమ్మును పొందొచ్చు. మీరు సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతా తెరిచేందుకు సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

నెలకు రూ. 5,000 పెట్టుబడితో చేతికి రూ. 28 లక్షలు:

ఆడపిల్లలు గల తల్లిదండ్రులు వారి కూతురు పేరుపై ఖాతాను ఓపెన్ చేసి సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ. 5,000 డిపాజిట్ చేయొచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 28 లక్షల వరకు పొందే వీలుంది. నెలకు రూ. 5 వేల చొప్పున పెట్టుబడి పెడితే ఏడాదిలో మొత్తం రూ. 60,000 జమ అవుతుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.9,00,000 పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడిపై 8.2 శాతం వడ్డీ అందిస్తున్నది. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం 8.2 శాతం వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 28.73 లక్షలు చేతికి వస్తాయి.

Show comments