లక్షల్లో వడ్డీ ఆదాయం.. నెలకు ఇంత కడితే చేతికి 21 లక్షలు.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీం ఇదే

Post Office Recurring deposit scheme: మీ పొదుపును మంచి ఇన్వెస్ట్ మెంట్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి 21 లక్షలు అందుకోవచ్చు.

Post Office Recurring deposit scheme: మీ పొదుపును మంచి ఇన్వెస్ట్ మెంట్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి 21 లక్షలు అందుకోవచ్చు.

మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. వడ్డీతోనే లక్షల్లో ఆదాయం అందుకోవచ్చు. పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ మెంట్ ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది. పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి మంచి రాబడిని అందుకోవచ్చు. మరి మీరు కూడా పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ నాటికి 21 లక్షలు అందుకోవచ్చు. నెలకు ఎంత కట్టాలంటే?

పోస్టాఫీస్ అనేక రకాల స్కీమ్ లను అమలు చేస్తున్నది. వాటిల్లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇందులో అధిక వడ్డీరేటు పొందొచ్చు. ఈ పథకంలో వార్షిక ప్రాతిపదికన 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. నెలకు కనీసం రూ. 100 నుంచి డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. అవసరమైతే మరో ఐదేళ్లు కూడా పొడిగించుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి రాబడి ఉంటుంది.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో రూ. 21 లక్షలు పొందాలంటే నెలకు రూ. 30 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి 3.6 లక్షలు జమ అవుతుంది. ఇలా ఐదు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం 18 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై వడ్డీ ఆదాయం 3,40,974 వస్తుంది. అంటే వడ్డీ ద్వారానే 3 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుందన్నమాట. ఇక ఐదేళ్లు పెట్టుబడి తర్వాత మెచ్యూరిటీ నాటికి పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని చేతికి మొత్తం రూ. 21,40,974 అందుతుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి 21 లక్షలు అందుకోవచ్చు.

Show comments