Recurring deposit: బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్.. 10 వేల పెట్టుబడితో చేతికి 7 లక్షలు

బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్.. 10 వేల పెట్టుబడితో చేతికి 7 లక్షలు

Recurring deposit: మీరు అధిక లాభాలను ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ స్కీమ్ లో నెలకు 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి రూ. 7 లక్షలు పొందొచ్చు.

Recurring deposit: మీరు అధిక లాభాలను ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ స్కీమ్ లో నెలకు 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి రూ. 7 లక్షలు పొందొచ్చు.

ఫ్యూచర్ లో ఆర్థిక కష్టాలు ఉండకూడదంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయడం బెటర్. ఆపదలు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేము. అలాంటి సమయాల్లో పొదుపు చేసిన డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది పొదుపు చేయడానికి ప్రియారిటీ ఇస్తున్నారు. అయితే పెట్టుబడి పెడితే గ్యారంటీ రిటర్స్న్ తో పాటు రిస్క్ లేకుండా ఉండాలనుకుంటుంటారు. ఇలాంటి వారికోసం పోస్టాఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తోంది. మరి మీరు కూడా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడిపెట్టి లక్షల్లో లాభాలు అందుకోవాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడిపెడితే మంచి లాభం పొందొచ్చు. రూ. 10 వేల పెట్టుబడితో చేతికి 7 లక్షలు వస్తాయి.

పోస్టాఫీస్ అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ పథకంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకోవాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి మొదలైన సంవత్సరం తర్వాత లోన్ కూడా పొందొచ్చు. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం ఉంటుంది.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో నెలకు రూ. 10 వేలే పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ. 7 లక్షలు పొందొచ్చు. రోజుకు 333 పొదుపు చేసి అంటే నెలకు రూ. 10 వేలు పెట్టాలి. అంటే సంవత్సరానికి మీ పెట్టుబడి 1,20,000 అవుతుంది. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేశారనుకుంటే మీ పెట్టుబడి మొత్తం రూ. 6,00,000 అవుతుంది. ఈ పథకంలో అందించే వడ్డీరేటు 6.7 తో మీ పెట్టుబడిపై రూ. 1,13,659 ఆదాయం పొందుతారు. ఇక మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ ఆదాయం కలుపుకుని మీ చేతికి రూ. 7,13,659 అందుతుంది. సురక్షితమైన రాబడి కోసం ఈ స్కీమ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు.

Show comments