PM AJAY Yojana: కష్టాల్లో ఉన్నారా? యువతకు ఫ్రీగా 50వేలు ఇస్తున్న కేంద్రం.. ఎలా పొందొచ్చంటే?

కష్టాల్లో ఉన్నారా? యువతకు ఫ్రీగా 50వేలు ఇస్తున్న కేంద్రం.. ఎలా పొందొచ్చంటే?

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలు, యువత కోసం అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ఓ పథకం ద్వారా ఉచితంగా యువతకు 50 వేలు ఇస్తోంది కేంద్రం. దీనికి అర్హులు ఎవరంటే?

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలు, యువత కోసం అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ఓ పథకం ద్వారా ఉచితంగా యువతకు 50 వేలు ఇస్తోంది కేంద్రం. దీనికి అర్హులు ఎవరంటే?

కేంద్ర ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతోంది. కానీ స్కీమ్స్ పై అవగాహన లేక చాలా మంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. దేశంలోని మహిళలకు, యువతకు ఆర్థిక సాయాన్ని అందించి వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోంది. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి అవసరం. అంతా డబ్బు మీవద్ద ఉండకపోవచ్చు. ఈ కారణంగా అసలు వ్యాపారం చేయాలన్న ఆలోచనను విరమించుకుంటుంటారు. అయితే ఇలాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా యువత రూ. 50 వేలు పొందే అవకాశం ఉంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు మీకోసం..

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజన(పీఎం అజయ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు) నిరుద్యోగ యువత స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గ్రామాల్లోని షెడ్యూల్ కులాల యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.50 వేల గ్రాంట్ ను అందిస్తోంది కేంద్రం. గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో.. ఒక గ్రామంలో 10మంది సభ్యుల చొప్పున రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తారు. రూ.2.5 లక్షల వార్షికాదాయం ఉన్న యువతను ఈ గ్రూపుల్లో సభ్యత్వం కోసం ఎంపిక చేస్తారు. గ్రూపులో చేరిన ప్రతి వ్యక్తికీ, ప్రాజెక్ట్ వ్యయంలో 50% లేదా గరిష్టంగా రూ.50,000 గ్రాంట్ ఇస్తారు. దీంతో మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు.

ప్రధాన మంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజన పథకానికి అర్హులు ఎవరంటే.. గ్రామాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల పౌరులు మాత్రమే అర్హులు. దరఖాస్తుదారుడి వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసుకుననేందుకు అధికారిక వెబ్ సైట్ https://pmajay.dosje.gov.inలోకి వెళ్లి కావాల్సిన పత్రాలను, వివరాలను, సమాచారాన్ని అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

Show comments