iDreamPost

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 45 పైసలకే 10 లక్షల బీమా పొందొచ్చు.. ఎలా అంటే?

రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్. భారతీయ రైల్వే నుంచి 10 లక్షలు పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. కేవలం 45 పైసలు చెల్లించి 10 లక్షల బీమా పొందొచ్చు. ఎలా అంటే?

రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్. భారతీయ రైల్వే నుంచి 10 లక్షలు పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. కేవలం 45 పైసలు చెల్లించి 10 లక్షల బీమా పొందొచ్చు. ఎలా అంటే?

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 45 పైసలకే 10 లక్షల బీమా పొందొచ్చు.. ఎలా అంటే?

దేశంలో నిత్యం వేలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తూ తమ గమ్యాస్థానాలకు చేరుకుంటున్నారు. సామాన్యుడి విమానంగా పేరుగాంచిన రైలు ప్రయాణానికి ప్రయాణికుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఛార్జీలు తక్కువగా ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. నిత్యం రైళ్లన్ని ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఇక పండగల సమయంలో ట్రైన్స్ అన్ని కిక్కిరిసిపోతుంటాయి. అయితే రైలు ప్రయాణం సురక్షితమే అయినప్పటికి కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఈ ప్రమాదంలో గాయపడిన, మరణించిన ప్రయాణికులకు భారతీయ రైల్వై ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ ఉంటుంది. అయితే రైల్వే డిపార్ట్ మెంట్ రైలు ప్రయాణికులకు బీమా సౌర్యాన్ని కల్పిస్తోంది. కేవలం 45 పైసలు చెల్లిస్తే చాలు 10 లక్షలు పొందొచ్చచు.

భారతీయ రైల్వే ప్రయాణికులకు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను అందిస్తోంది. రైలు ప్రమాదాల భారిన పడ్డప్పుడు ప్రయాణికులు బీమా ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ బీమా ప్రయోపజనాలను పొందాలంటే రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ప్రయాణికులకు అవగాహన లేక బీమాను ఎంచుకోవట్లేదు. ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసేటప్పుడు ఈ బీమాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బీమా కోసం ప్రయాణికులు కేవలం 45 పైసలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇది ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటేనే వర్తిస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో టికెట్ బుక్ చేస్తే బీమాను పొందలేరు.

భారతీయ రైల్వే కల్పిస్తున్న ఈ బీమా సౌకర్యాన్ని ప్రయాణికుడు ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసేటపుడు ఎంపిక చేసుకుంటేనే వర్తిస్తుంది. 45 పైసలు చెల్లిస్తే రైలు ప్రమాదానికి గురైన సమయంలో 10 లక్షలు బీమా అందిస్తుంది రైల్వే శాఖ. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడితే రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడితే రూ.50 వేలు పరిహారం అందజేస్తారు. ఏదైనా కారణంగా మరణిస్తే రూ.1.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.50 వేలు, చిన్నపాటి గాయాలు అయితే రూ.5 వేలు. ప్రమాదంలో మరణిస్తే వారసుడికి రూ.10 లక్షలు అందుతాయి. మొత్తం వైకల్యం ఉన్న వ్యక్తికి రూ. 10 లక్షల బీమా లభిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి