iDreamPost
android-app
ios-app

తక్కువ సమయంలోనే రూ. 40వేల పెట్టుబడితో రూ. 10 లక్షల ఆదాయం.. ఎలా అంటే?

చదువు పూర్తైన తర్వాత ఉద్యోగం కంటే బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కడో, ఎవరి దగ్గరో పని చేసే కంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారు. దీని ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు.

చదువు పూర్తైన తర్వాత ఉద్యోగం కంటే బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కడో, ఎవరి దగ్గరో పని చేసే కంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారు. దీని ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు.

తక్కువ సమయంలోనే రూ. 40వేల పెట్టుబడితో రూ. 10 లక్షల ఆదాయం.. ఎలా అంటే?

చదువు పూర్తైన తర్వాత ఉద్యోగం కంటే బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎక్కడో, ఎవరి దగ్గరో పని చేసే కంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారు. దీని ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పాడి, పౌల్ట్రీ పరిశ్రమలు పెట్టుకుని లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. మరికొంత మంది వ్యవసాయం చేస్తూ కూడా అధికంగా సంపాదిస్తున్నారు. అందరిలా మూస పద్దతిలో కాకుండా భిన్నంగా ఆలోచించి వెరైటీ రకాల పంటలను పండిస్తూ అతి తక్కువ సమయంలోనే లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు.

వాణిజ్య పంటలు సుగంధ ద్రవ్యాలకు మార్కెట్ లో ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. వీటిని సాగు చేసినట్లైతే అధిక లాభాలను పొందే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా వెల్లుల్లి పంట రైతులకు లక్షల ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఎకరం సాగుకు రూ. 40 వేల పెట్టుబడితో కేవలం నాలుగు నెలల్లోనే రూ. 10 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉండనుంది. వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా వాడుతుంటారు. వెల్లుల్లి సుగంధ ద్రవ్యంగానే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ కారణంతో మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పంటను సాగు చేయడం ద్వారా రైతులు లక్షాధికారి అయ్యే అవకాశం ఉంటుంది.

ఎకరం సాగు భూమిలో వెల్లుల్లిని సాగు చేసినట్లైతే నాలుగు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. ఎకరం సాగుకు రూ. 40వేల పెట్టుబడి అవసరమవుతుంది. అన్ని విదాల సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే ఎకరానికి 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. డిమాండ్ మేరకు మార్కెట్ లో వెల్లుల్లి క్వింటాల్ కు రూ. 10వేల నుంచి రూ. 20వేల వరకు ధర పలుకుతుంది. ఈ క్రమంలో దాదాపు రూ. 10 లక్షల ఆదాయాన్ని పొందే వీలుంటుంది. ఈ విధంగా కేవలం నాలుగు నెలల్లోనే పది లక్షలు సంపాదించుకోవచ్చు. మంచి రకాలను ఎంచుకుని సాగు చేస్తే లాభాలు గ్యారంటీ అంటున్నారు వెల్లుల్లి సాగు చేసే రైతులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి