Insurance డబ్బులు లేట్ అవుతున్నాయా? ఇలా చేస్తే వెంటనే మీ సమస్య తీరుతుంది!

Insurance: చాలా బీమా కంపెనీలు కూడా మనకు డబ్బులని సకాలంలో క్లెయిమ్ చెయ్యవు. చాలా నిర్లక్ష్యం చేస్తుంటాయి.

Insurance: చాలా బీమా కంపెనీలు కూడా మనకు డబ్బులని సకాలంలో క్లెయిమ్ చెయ్యవు. చాలా నిర్లక్ష్యం చేస్తుంటాయి.

ప్రస్తుతం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక భవిష్యత్తుకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అనేది కచ్చితంగా చాలా అవసరం. ఈ పాలసీ అనుకోని ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. మన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుంది. చాలా కంపెనీలు కూడా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పొలసీలు అందిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం సకాలంలో డబ్బులు ఇవ్వవు. ఇలాంటి సమస్య సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఎదురు కుంటూ ఉంటాము. మరి దీనికి పరిష్కారం లేదా అంటే చక్కటి పరిష్కారం ఉంది? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దారులు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఒక సమస్య ఎదురుకుంటారు. అదేంటంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు లేట్ అవుతాయి. కొన్ని కంపెనీలు అయితే ముందు మీరు మీ డబ్బులు కట్టుకోండి .. ఆ తరువాత మేము ఆ డబ్బుని మీకు మీ అకౌంట్ లో వేస్తాము అని చెబుతాయి. కొంత మందికి ఓకే అయినా దీని వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. సమయానికి హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు అందక బయట అప్పు చేసి మరీ హాస్పిటల్ లో బిల్లు కడతారు. అయితే ఇక నుంచి మీకు ఆ ఇబ్బంది ఉండదు. మీరు ఈ ఒక్క పని చేస్తే బీమా కంపెనీలు కిందకి దిగి వస్తాయి. సకాలంలో మీ డబ్బులను మీకు అందజేస్తాయి.

Insurance Regulatory and Development Authority of India(IRDAI) రూల్స్ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వ్యక్తి హాస్పిటల్ ఖర్చుని గంట లోపే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేయాలి. లేదంటే ఆ కంపెనీలపై చర్యలు తప్పవు. ఒకవేళ మీకు మీ ఇన్సూరెన్స్ డబ్బులు రావడం లేట్ అయినా లేక బీమా కంపెనీలు మీ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా మీరు https://bimabharosa.irdai.gov.in/ వెబ్ సైట్ లో కంప్లయింట్ చేయవచ్చు. లేదా మీ కంప్లైంట్ ని complaints@irdai.gov.in.కి ఈమైల్ చేయవచ్చు. అలాగే 155255 లేదా 1800 4254 732 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు. దీంతో నిర్లక్ష్యంగా ఉన్న బీమా కంపెనీలకు ఫైన్ పడుతుంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ రూల్స్ ప్రకారం మీ సమస్య 30 రోజుల్లోపు తీరకపోతే బీమా కంపెనీలు కచ్చితంగా రోజుకి మీకు 5000 రూపాయల పెనాల్టీ కట్టాలి. కాబట్టి ఈ రూల్స్ ని గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి బీమా కంపెనీలు నిర్లక్ష్యం చేస్తే ఈ విధంగా కంప్లైంట్ చేస్తామని చెప్పండి. దాంతో వెంటనే మీ డబ్బును బీమా కంపెనీలు సకాలంలో చెల్లిస్తాయి. ఇదీ సంగతి.. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments