ఆ బ్యాంకు ఖాతాదారులకి బ్యాడ్ న్యూస్! ఇకపై భారీగా ఫైన్స్ కట్టాల్సిందే!

Yes Bank: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. దీంతో చాలా వరకు ఆర్థిక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా ఇది బ్యాంకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యాంక్ ఒకటి సేవింగ్స్ అకౌంట్ ఛార్జీల్ని సవరించింది.

Yes Bank: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. దీంతో చాలా వరకు ఆర్థిక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా ఇది బ్యాంకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యాంక్ ఒకటి సేవింగ్స్ అకౌంట్ ఛార్జీల్ని సవరించింది.

ప్రస్తుతం ఉన్న అన్ని వ్యవస్థలో బ్యాంకింగ్ వ్యవస్థ చాలా ప్రధానమైనది. ఈ వ్యవస్థను ఎంతో మంది ఉపయోగించుకుంటున్నారు. నిత్యం చాలా మంది బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తుంటారు. అలానే తరచూ బ్యాంకింగ్ కి సంబంధించిన సమాచారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక వడ్డీ రేట్లు, సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్ డిపాజిట్ వంటి వివిధ వాటిపై అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సేవింగ్స్ అకౌంట్ ఛార్జీల్ని సవరిస్తున్నట్లు ప్రకటించింది. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దా…

ప్రైవేటు సెక్టార్ కి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో యెస్ బ్యాంక్ ఒకటి. తన కస్టమర్లను పెంచుకునేందుకు తరచూ అనేక ఆఫర్లు ప్రకటించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తాజాగా యెస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇక యెస్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకార..పలు ఆసక్తిక నిర్ణయాలను సదరు బ్యాంక్ తీసుకుంది. సేవింగ్స్ అకౌంట్స్ ఛార్జీల్ని సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఇలానే కొన్ని ప్రత్యేక అకౌంట్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

యెస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తుంది. అయితే ఇది సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణ, సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేట్లు ఒకేలా ఉంటాయి. రూరల్, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లోనూ ఒకేలా ఉంటాయి. ఈ మార్పులు 2024, జనవరి 1 నుంచే అమలవుతున్నాయి. చాలా వరకు సేవింగ్స్ అకౌంట్లలో ఎంత బ్యాలెన్స్ మెయిటైన్ చేయాలనేది బ్యాంకులు ముందుగానే నిర్ణయిస్తాయి. అలానే తాజాగా యెస్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ప్రో మ్యాక్స్‌లో కనీసం రూ. 50,000 చేయాల్సి ఉంటుంది. అలా లేని సమయంలో గరిష్టంగా రూ. 1000 ఛార్జీ పడుతుంది.

అదే విధంగా మరో ఖాతా అయినా సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్ కూడ మినిమం బ్యాలెన్స్ రూ. 25 వేలుగా మొయింటైన్ చేయాలి. లేనిపక్షంలో ఇక్కడ రూ.750 ఛార్జీ పడుతుంది. సేవింగ్స్ అకౌంట్ ప్రో లో కనీసం రూ. 10 వేలు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి. లేకపోతే దీనికి కూడా గరిష్టంగా రూ. 750 ఫైన్ విధిస్తుందు. అలానే మై ఫస్ట్ ఎస్  అకౌంట్ లో మినిమం రూ.2500 ఉండాలి.లేకపోతే రూ.250 ఫైన్ గా ఎస్ బ్యాంకు నిర్ణయిచింది. సేవింగ్స్ వాల్యూ లేదా కిసాన్ ఎస్ఏ అకౌంట్ల విషయానికి వస్తే.. ఇక్కడ కనీసం రూ. 5 వేలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఛార్జీ రూ. 500 గా ఉంది.

ఇదే సమయంలో బ్యాంక్.. కొన్ని అకౌంట్లను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. యెస్ సేవింగ్స్ సెలక్ట్/ఎక్స్ ఎల్ రేట్ ఎస్ , సేవింగ్స్ ఎక్స్‌క్లూజివ్,  సీనియర్ సిటిజన్లు కోసం ఉన్న యెస్ రెస్పెక్ట్ , సేవింగ్స్ అడ్వాంటేజ్/యెస్ గ్రేస్/యెస్ ప్రాస్పరిటీ ప్రైమ్/అసెంట్/క్రెస్ట్, సేవింగ్స్ ప్రో ఖాతాలను నిలిపివేసింది. అంటే ఇకపై ఈ సేవింగ్స్ అకౌంట్లను జారీ చేయబోదన్నమాట.

అలానే యెస్ బ్యాంకుకి సంబంధించిన డెబిట్ కార్డు ఛార్జీల గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఎలిమెంట్ డెబిట్ కార్డుపై రూ .299, ఎంగేజ్ డెబిట్ కార్డుపై రూ. 399, ఎక్స్‌ప్లోర్ డెబిట్ కార్డుపై రూ. 599 లు ఛార్జీలు వసూలు చేస్తోంది. కిసాన్ అకౌంట్ కి మాత్రమే రూపే డెబిట్ కార్డు రూ. 149 గా ఉంది. అలానే ఇతర బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంల దగ్గర డెబిట్ కార్డ్ వినియోగిస్తే.. నెల 5 ట్రాన్సాక్షన్లు ఉచితం. తర్వాత ప్రతి లావాదేవీపై రూ. 21 ఛార్జీ పడుతుంది. మొత్తంగా యెస్ బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments