nagidream
Ring Rail Project Covered Areas In Hyderabad To Invest In Real Estate: మిడిల్ క్లాస్ వారికి, సామాన్యులకి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చేది ఏమీ లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రకటించినప్పుడే. ఆ ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు ఆ ఏరియాల్లో భూములు కొన్నవారికి అవి పూర్తయ్యాక భారీగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో సామాన్య, మధ్యతరగతి వారికి మేలు చేకూరనుంది.
Ring Rail Project Covered Areas In Hyderabad To Invest In Real Estate: మిడిల్ క్లాస్ వారికి, సామాన్యులకి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చేది ఏమీ లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రకటించినప్పుడే. ఆ ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు ఆ ఏరియాల్లో భూములు కొన్నవారికి అవి పూర్తయ్యాక భారీగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో సామాన్య, మధ్యతరగతి వారికి మేలు చేకూరనుంది.
nagidream
అవుటర్ రింగ్ రోడ్ పడక ముందు వరకూ కూడా నిజాంపేట, బాచుపల్లి, బండ్లగూడ లాంటి ఏరియాల్లో గజం స్థలం 3 వేలు, 5 వేల రూపాయలుగా ఉండేది. ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ పడిందో ఈ ప్రాంతాల్లో డిమాండ్ అనేది పెరిగింది. అవుటర్ రింగ్ రోడ్ పడడం వల్ల అప్పటి వరకూ సిటీ బయట ఉండేవి అని అనిపించుకున్న ప్రాంతాలు కూడా సిటీ లోపల ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. ప్రస్తుతం బాచుపల్లిలో గజం స్థలం 60 వేలుగా ఉంది. అయితే హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న సంగతి తెలిసిందే. అవుటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న యాచారం, కొంపల్లి, సూరారం, కీసర, జీడిమెట్ల, ఘట్కేసర్, చౌటుప్పల్ వైపు ఉన్న స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో భారీ లాభాలు ఆశించవచ్చు. మరో బాచుపల్లి రేంజ్ లో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు ప్రాజెక్ట్ నిర్మించేందుకు కేంద్ర రైల్వే శాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేసింది. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఎలా అయితే వస్తుందో.. దానికి సమాంతరంగా అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది. సుమారు 564 కి.మీ. పరిధిలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. రీజనల్ రింగ్ రోడ్ కోసం సేకరించిన భూముల్లోనే అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ రానుంది. రీజనల్ రింగ్ రోడ్ లో డెవలప్ అయ్యే టౌన్ షిప్ లు, ఇండస్ట్రియల్ జోన్లకు ఈ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కీలకం కానుంది. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రింగ్ రైల్ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి.
రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులు ఈ రెండూ.. అనేక ప్రాంతాలను, నగరాలను అనుసంధానం చేసే ప్రాజెక్టులు. తెలంగాణ ప్రాంతంలో 40 శాతం వరకూ ఈ ప్రాజెక్ట్ విస్తరించనుంది. అక్కన్నపేట్, భువనగిరి, యాదగిరిగుట్ట, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గేట్ వనంపల్లి, గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నారాయణపూర్, షాద్ నగర్, షాబాద్, రామన్నపేట వంటి గ్రామాలను, పట్టణాలను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కలుపుతూ ఈ అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ రానుంది. తెలంగాణలో అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది గేమ్ ఛేంజర్ గా అవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కనుక ఈ ప్రాంతాల్లో భూములు కొన్నవారు కోటీశ్వరులవ్వడం పక్కా అని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.