ఇంటి లోన్ తర్వగా తీర్చేయాలనుకుంటున్నారా..? ఈ టిప్స్ పాటించండి

ప్రతి ఒక్కరికి డ్రీమ్ హోం కట్టుకోవాలని కోరిక ఉంటుంది. అది చిన్నాదైనా పెద్దదైనా.. స్థోమతకు తగ్గట్లు ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు. అయితే సొంత సొమ్మును సమకూర్చుకుని.. మిగిలిన మొత్తం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. తీసుకున్నప్పడు బాగుండే రుణం.. తీర్చేసరికి..

ప్రతి ఒక్కరికి డ్రీమ్ హోం కట్టుకోవాలని కోరిక ఉంటుంది. అది చిన్నాదైనా పెద్దదైనా.. స్థోమతకు తగ్గట్లు ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు. అయితే సొంత సొమ్మును సమకూర్చుకుని.. మిగిలిన మొత్తం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. తీసుకున్నప్పడు బాగుండే రుణం.. తీర్చేసరికి..

ఇల్లే కదా స్వర్గసీమ. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు నిర్మించుకోవాలని కల ఉంటుంది. అయితే వచ్చే రాబడి తక్కువ.. ఖర్చులు ఎక్కువ కావడంతో కొంత మందికి ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. మరి కొంత మంది ప్రణాళిక బద్దంగా లెక్కలు వేసుకుంటూ.. సొంతింటిని సొంతం చేసుకుంటున్నారు. తమ వద్ద దాచుకున్న సొంత సొమ్ముకు.. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని.. టైమ్ పీరియడ్ పెట్టుకుని నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు పాటు గృహ రుణాలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇంటి రుణాలు కూడా నేడు భారంగా మారుతున్నాయి. ఎందుకంటే.. గృహ రుణ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి బ్యాంకులు. రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు వడ్డీ రేటు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

మరీ ఈ క్రమంలో ఇంటి రుణ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి..? తొందరగా గృహ రుణం తీరిపోయే మార్గాలేమిటీలో ఓ సారి లుక్కేయండి. ఇల్లు తీసుకున్న సమయంలో ఈఎంఐ కట్టే పీరియడ్.. సుమారు 15 నుండి 20 సంవత్సరాలు పాటు పెట్టుకుంటూ ఉంటారు. ఇందులో వడ్డీ భారంగా ఉంటుంది. అయితే ప్రతి నెల కట్టే ఈఎంఐకి మరికొంత అదనంగా కట్టుకుంటే.. అసలుతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది. ఉదాహరణకు 50 లక్షల గృహ రుణం తీసుకుని.. 20 ఏళ్ల పీరియడ్ తీసుకుంటే.. 8.5 శాతం చొప్పున 43, 237 వరకు కట్టాల్సి వస్తుంది. అంటే 20 ఏళ్లల్లో కేవలం వడ్డీనే 54.13 లక్షలు ఉంటుంది. అంటే అసలు కన్నా ఎక్కువ. ఈ 20 ఏళ్లల్లో కోటికి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా.. టైమ్ పీరియడ్ తక్కువ పెట్టుకుని, ఈఎంఐ పెంచుకుంటే.. తక్కువ వడ్డీ రేటుతో.. సొంతింటిని స్వంతం చేసుకోవచ్చు. అలా కాకుండా అదనంగా సొంత సొమ్ము జమ చేస్తూ.. సుమారు 2-5 లక్షల రూపాయల వడ్డీ కలిసి వచ్చే అవకాశం ఉంది.

ఈఎంఐ రూపంలో చెల్లించే ప్రతి రూపాయి అసలుకు జమ అవుతున్న నేపథ్యంలో వడ్డీ భారం కూడా తగ్గుతుంది. కొన్ని సార్లు అనుకోవచ్చు.. చెప్పడానికి ఏముంది.. ఆచరణలో జరగాలి కదా.. కానీ తలుచుకుంటే కచ్చితంగా జరుగుతుంది. కాస్త ఖర్చు తగ్గించుకుని.. ఆ డబ్బులను గృహ రుణాలను తీర్చడానికి వినియోగిస్తే.. సొంతింటి కల తలకుమించిన భారంగా మారదు. వేతనం పెరిగినప్పుడు కూడా ఆ డబ్బును కూడా రుణం తీర్చే వైపుగా మళ్లిస్తే.. అనుకున్న గ్రేస్ పీరియడ్ కన్నా ముందే సొంతింటి కల సాధ్యం అవుతుంది. అలాగే ఇల్లు కొనేటప్పుడు లోన్ వస్తుంది కదా అని డబ్బులున్న డౌన్ పేమెంట్ తక్కువ చెల్లిస్తుంటారు. కానీ అమౌంట్ ఎంత ఎక్కువ చెల్లిస్తే.. అంత మనకు భారం తగ్గినట్లే. అసలు తక్కువగా తీసుకునే అవకాశంతో పాటు వడ్డీ కూడా భారం కాదు. పోనీ నెల నెల ఎక్కువ కట్టలేము అనుకున్నప్పుడు.. ప్రతి ఏటా..కాస్త డబ్బులు ఎక్కువ చెల్లించాడానికి ప్రయత్నిస్తే సాధ్యం అవ్వొచ్చు. అలాగే పెట్టుబడులపై రాబడి,బోనస్, పాలసీల నుండి వచ్చిన డబ్బులు.. అవసరాలకు ఉపయోగించకుడా.. ఇంటి రుణానికి వినియోగిస్తే… డ్రీమ్ హౌస్ కమ్ ట్రూ అవుతుంది.

Show comments