iDreamPost
android-app
ios-app

ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. గ్రాట్యుటీ భారీగా పెంపు

ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..  గ్రాట్యుటీ భారీగా పెంపు

దేశంలో అతిపెద్ద మరియు అత్యంత విలువైన ప్రభుత్వ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. భారత ప్రజల నుంచి అత్యంత ఆధరణ పొందింది ఎల్ఐసీ. అద్భుతమైన పాలసీలను ప్రవేశపెడుతూ పాలసీదారులకు నమ్మకం కలిగిస్తూ ఎల్ఐసీ దూసుకెళ్తుంది. అయితే దీని వెనకాల ఎల్ఐసీ ఏజెంట్లు సంస్థలో పని చేసే ఉద్యోగుల కృషి ఎనలేనిది. కాగా వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది. తాజాగా ఏజెంట్లకు, ఉద్యోగులకు ఎల్ఐసీ తీపి కబురును అందించింది. వారికి అందించే గ్రాట్యుటీని భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 13 లక్షల మంది ఏజెంట్లకు, ఒక లక్ష మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్లు, ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఎల్ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ రూ. 3000-10,000 ల నుంచి రూ. 25,000- 1,50,000 వరు పెంచేందుకు ఆమోదం తెలిపింది. టర్మ్ ఇన్సూరెన్స్ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుందని ఆర్థిక మంత్రత్వ శాఖ తెలిపింది. ఇక ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పెన్షన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంక్షేమ చర్యలతో ఎల్ఐసీ దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని చూస్తోందని కేంద్రం తెలిపింది.