TVS Jupiter 125: ఈ స్కూటీతో మీ పెట్రోల్ ఖర్చులు తగ్గిపోయినట్లే.. ఏకంగా 57KM రేంజ్

ఈ స్కూటీతో మీ పెట్రోల్ ఖర్చులు తగ్గిపోయినట్లే.. ఏకంగా 57KM రేంజ్

TVS Jupiter 125: వాహనదారులకు మంచి మైలేజీ ఇచ్చే స్కూటీ అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ స్కూటీ 57 కి.మీల రేంజ్ ను ఇస్తుంది. మైలేజీ కావాలనుకునే వారికి బెస్ట్ స్కూటీ.

TVS Jupiter 125: వాహనదారులకు మంచి మైలేజీ ఇచ్చే స్కూటీ అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ స్కూటీ 57 కి.మీల రేంజ్ ను ఇస్తుంది. మైలేజీ కావాలనుకునే వారికి బెస్ట్ స్కూటీ.

ప్రస్తుత రోజుల్లో టూవీలర్ అత్యవసరంగా మారిపోయింది. ఆఫీసులకు వెళ్లే వారు.. ఇతర వృత్తి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు, ఇతర అవసరాల కోసం టూవీలర్ ను వాడుతున్నారు. అయితే ఒకప్పుడు ఎక్కువగా బైక్స్ కొనేందుకు ఇంట్రెస్టు చూపించేవారు. ఆ తర్వాత స్కూటీలు అందుబాటులోకి వచ్చాయి. గేర్స్ తో కూడిన బైక్ లను నడపడం కంటే గేర్ లెస్ స్కూటీలను నడపడం ఈజీగా ఉండడంతో స్కూటీలకు ఆదరణ పెరిగింది. ఆడ, మగ తేడా లేకుండా అన్ని వయసుల వారికి స్కూటీలు అనుకూలంగా మారాయి. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవడం, మైలేజీ పరంగా కూడా స్కూటీలు ఆకట్టుకుంటుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది.

మీరు ఈ మధ్య కొత్త స్కూటీని కొనాలని భావిస్తున్నారా? బడ్జెట్ ధరలోనే మంచి మైలేజీ ఇచ్చే స్కూటీ కోసం చూస్తున్నారా? అయితే మీకు ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ నుంచి అదిరిపోయే స్కూటీ అందుబాటులో ఉంది. అదే టీవీఎస్ జుపిటర్ 125. ఈ స్కూటీ తక్కువ ధరతో ఎక్కువ మైలేజీని అందిస్తున్నది. మంచి మైలేజీ కావాలనుకునే వారికి ఈ స్కూటీ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.89,155 నుంచి రూ.99,805(ఎక్స్-షోరూమ్)గా ఉంది. డ్రమ్, డిస్క్, వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

జుపిటర్ స్కూటర్ 124.8 cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో 8.2 పీఎస్ గరిష్ట శక్తిని, 10.5 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 57 కి.మీల వరకు మైలేజీని అందిస్తుంది. టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్‌తో సహా పలు ఫీచర్లను అందిస్తుంది. హెల్మెట్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి వస్తువులను సులభంగా తీసుకెళ్లడానికి 33 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ ఉంది. ఈ స్కూటర్‌లో భద్రత కోసం డిస్క్, డ్రమ్ బ్రేక్ ఎంపికలు ఉన్నాయి. ముందు, వెనుక 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంది. సామాన్యులకు ఈ స్కూటీ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.

Show comments