ఇక సామాన్యుల జేబుకు చిల్లే.. వీటి ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం

TV Channel Rates: ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో బిజినెస్‌ సర్కిల్స్‌లో ఓ వార్త హల్చల్‌ చేస్తోంది. త్వరలోనే సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. మరి వేటి ధరలు పెరగనున్నాయి అనే వివరాలు..

TV Channel Rates: ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో బిజినెస్‌ సర్కిల్స్‌లో ఓ వార్త హల్చల్‌ చేస్తోంది. త్వరలోనే సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. మరి వేటి ధరలు పెరగనున్నాయి అనే వివరాలు..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. రెండింటికి మధ్య స్వల్ప సీట్ల తేడా ఉంది. దాంతో ఏ కూటమి అధికారంలోకి రానుందో అనే ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు ఎన్నికలు ఉండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపు జోలికి వెళ్లలేదు. ఇక ఇప్పుడు ఫలితాలు వచ్చేశాయి. ఈ క్రమంలో త్వరలోనే కొన్నింటి ధరలు పెంచేందుకు రంగం సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. దాంతో సామాన్యుల జేబుకు చిల్లు పడనుంది. ఇంతకు వేటి ధరలు పెరగనున్నాయి.. ఎంత వరకు పెరగనున్నాయి అనే వివరాలు మీ కోసం..

సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేందుకు రంగం సిద్ధం అవుతుంది. టీవీ ఛానళ్ల ధరలు పెరగబోతున్నాయి. ప్రతి నెల చేపించే టీవీ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయి. డిస్నీ స్టార్ , వయాకామ్ 18, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్‌కాస్టర్లు బొకే రేట్లను పెంచడానికి రెడీ అవుతున్నారు. ఈ కారణంగా టీవీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా పెరగవచ్చని తెలుస్తుంది. వీటి ధరలు దాదాపు 5-8 శాతం వరకు పెరుగుతాయని పరిశ్రమ అధికారులు వెల్లడించారు.

సాధారణ వినోద ఛానెల్‌ల మార్కెట్ వాటా పెరుగుదల కారణంగా కొన్ని ఛానెల్స్‌ తమ సబ్‌స్క్రిప్షన్‌ ధరలను 25 శాతం పైగా పెంచేందుకు రెడీ అవుతున్నాయి. అయితే టీవీ ఛానెల్‌ ధరలు జనవరిలోనే పెంచాలని బ్రాడ్‌కాస్ట్‌ కంపెనీలు భావించాయి. కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అప్పుడు వాయిదా వేశారు. జూన్ 1న పోలింగ్ ముగియనున్నందున, రేట్లు పెంచడానికి ప్రసారకర్తలు డీపీఓలను ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ వంటి కొన్ని డీపీఓలు ఇప్పటికే ధరలను స్వల్పంగా పెంచాయి.

త్వరలనే మిగతా బ్రాడ్‌కాస్టర్స్‌ వాటి ధరలు పెంచనున్నాయి. దాంతో మీ టీవీ రీఛార్జ్‌ బిల్లు మరింత పెరగనుంది. అలానే టెలికాం కంపెనీలు.. తమ మొబైల్‌ రీఛార్జ్‌ ప్యాక్‌ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సామాన్యులకు నిత్యవసరాలుగా మారాయి. కనుక వీటి ధరలు భారీగా పెంచనున్న నేపథ్యంలో సామాన్యులపై మరింత భారం కానుంది. వీటితో పాటు ఇక ఏ ఏ రేట్లు పెరుగతాయో చూడాలి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

Show comments