టొయోటా బంపర్ ఆఫర్.. కార్లపై భారీ డిస్కౌంట్!

Toyota: టొయోటా కార్లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ కార్లు మంచి బిల్డ్ క్వాలిటీ కలిగి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.

Toyota: టొయోటా కార్లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ కార్లు మంచి బిల్డ్ క్వాలిటీ కలిగి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.

టొయోటా కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ కార్లు మంచి బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటాయి. వీటిలో మధ్యతరగతి జనాలు ఎక్కువగా అర్బన్ క్రూయిజర్, హైరైడర్‌, గ్లాంజా కార్లని కొనుగోలు చేస్తుంటారు. వీటిలో చాలా మంచి ఫీచర్లు ఉంటాయి. తాజాగా టొయోటా కంపెనీ ఈ మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. కేవలం వీటి పైనే కాకుండా మిగతా కార్లపై కూడా భారీ తగ్గింపులు ఇస్తుంది టొయోటా కంపెనీ. టోయోటా తన కార్లపై ఏకంగా రూ.5 లక్షల దాకా తగ్గింపు లభిస్తుంది. ఇక ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తుందో వాటి గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ కార్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్ పై రూ. 75,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ టయోటా కారు ధర విషయానికి వస్తే.. ఈ కార్ ప్రారంభ ధర రూ. 11.14 లక్షలు ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ వచ్చేసి రూ. 20 లక్షల దాకా ఉంటుంది. ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. అలాగే EBDతో కూడిన ABS, వాహన స్థిరత్వ నియంత్రణ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో 9-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా గ్లాంజా కూడా అందుబాటు ధరలో కాభించే కార్. కంపెనీ దీని మీద రూ.68,000 దాకా తగ్గింపుని ఇస్తుంది. ఈ కార్ ధర విషయానికి వస్తే.. ఇది రూ. 6.86 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కార్ హై ఎండ్ వేరియంట్ రూ. 10 లక్షల దాకా ఉంటుంది. ఈ కార్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 88.5 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది. టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ కారుపై సుమారు రూ. 65,000 తగ్గింపు ఉంది. ఈ SUV కారులో 1.2 లీటర్ ఇంజన్ ఉంది. అలాగే ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఈ కారు ధర విషయానికి వస్తే.. ఇది రూ.7.74 లక్షల నుంచి రూ.13.04 లక్షల దాకా ఉంటుంది. ఇక టొయోటా హైలక్స్ కార్ పై రూ. 5 లక్షల వరకు కంపెనీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ కారు ధర రూ. 30 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

 

Show comments