iDreamPost

షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ తులం రేటు ఎంతకు చేరిందంటే?

  • Published May 17, 2024 | 8:21 AMUpdated May 17, 2024 | 8:21 AM

గత రెండు మూడు రోజుల వరకు బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చింది. కానీ, ఇంతలోనే నిన్నటి నుంచి బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాడుతూ అందరికి షాక్‌ కు గురిచేస్తున్నాయి. అయితే నేడు బంగారం ధర ఎంత పెరిగిందంటే..

గత రెండు మూడు రోజుల వరకు బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చింది. కానీ, ఇంతలోనే నిన్నటి నుంచి బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాడుతూ అందరికి షాక్‌ కు గురిచేస్తున్నాయి. అయితే నేడు బంగారం ధర ఎంత పెరిగిందంటే..

  • Published May 17, 2024 | 8:21 AMUpdated May 17, 2024 | 8:21 AM
షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ తులం రేటు  ఎంతకు చేరిందంటే?

బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అందుకే దీని ధర ఎలా ఉన్న డిమాండ్‌ మాత్రం ఎప్పుడు తగ్గదు. ఈ క్రమంలోనే బంగారం ధర ఎంత పెరిగినా దానిని కొనుగోలు చేయడానికి జనం ఎగబడుతుంటారు. అయితే మొన్న మొన్నటి వరకు పెళ్లిళ్లు, శుభకార్యల సీజన్‌ కావడంతో.. బంగారం ధర కొండెక్కి కూర్చున్న విషయం తెలిసిందే. ఇక పసిడి ధరలు భారీగా పెరగడంతో.. వాటిని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడేవారు. కానీ, గత మూడు, నాలుగు రోజులుగా ఈ బంగారం ధరలు భారీగా తగ్గడంతో.. వాటిని కొనుగోలు చేసిన ప్రజలకు కాస్త ఊరట లభించింది. అయితే ఇంతలోనే పసిడి ప్రియులకు షాక్‌ ను ఇస్తూ బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నేడు అనగా మే 17వ తేదీన బంగారం, వెండి రేట్లు మళ్లీ ఏ స్థాయికి చేరాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గత రెండు మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా అందరికీ షాకిస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడే పసిడి ధర దిగి రావడంతో.. వాటిని ప్రజలు కొనుగోలు చేద్దాం అనుకునే లోపే మళ్లీ భారీగా గోల్డ్‌ రేట్లు పెరిగాయి. కాగా, నిన్నటికి తుల బంగారం ధర రూ. 430 పెరిగి షాక్‌ ఇవ్వడంతో పాటు.. నేడు తుల బంగారం ధర మరో రూ. 770 పెరిగిపోయింది. దీంతో మొత్తంగా రెండో రోజుల్లోనే తులం రేటు రూ. 1200 పెరగడం పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో రివర్స్ గేర్ వేయడమే ధరల పెరుగుదలకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న సూచనలతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి.

ఇక మరోవైపు వెండి రేటు రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే రూ.1500 పెరిగింది. ఇలా చూసుకుంటే.. మూడు రోజుల్లోనే కిలో వెండి రేటు రూ. 2600 పెరగడం గమనార్హం. ఈ క్రమంలో మే 17వ తేదీన హైదరాబాద్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతెంత ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు సూచనలతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2378 డాలర్లుగా ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 29.67 డాలర్లు ఉంది. ఇక రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే ఇవాళ రూ.83.493 వద్ద విక్రయంలో ఉంది. ఇదిలా ఉంటే..హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. కాగా, ఈవాళ ఒక్కరోజే  24 క్యారెట్ల బంగారం రేటు రూ.770 మేర పెరిగిపోయింది. ఇక నిన్నటి ధరతో పోల్చుకుంటే మొత్తంగా రెండు రోజుల్లో తులం రేటు రూ.1200 ఎగబాకింది.

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు రూ. 74,020 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటురూ. 700 పెరిగి రూ. 67,850 వద్దకు చేరింది. ఇక బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం భారీగా పెరుగుతోంది. ఇవాళ కిలో వెండి రేటు రూ.1500 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే రూ. 92 వేల 600ల వద్ద ఉంది. మరి, బంగారం,వెండి ధరలు ఒక్కసారిగా పెరిగి పసిడి ప్రియులకు షాక్‌ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి