iDreamPost

పసిడి ప్రియులకు బిగ్‌ అలర్ట్‌.. వరుసగా తగ్గి సడెన్ షాకిచ్చిన బంగారం..

  • Published May 16, 2024 | 7:54 AMUpdated May 16, 2024 | 7:54 AM

గత మూడు రోజులుగా బంగారం ధరలు దిగివస్తూ పసిడి ప్రియులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఈ బంగారం ధరలపై సడెన్‌ షాకిస్తూ బిగ్‌ అలర్ట్‌ వచ్చింది.

గత మూడు రోజులుగా బంగారం ధరలు దిగివస్తూ పసిడి ప్రియులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఈ బంగారం ధరలపై సడెన్‌ షాకిస్తూ బిగ్‌ అలర్ట్‌ వచ్చింది.

  • Published May 16, 2024 | 7:54 AMUpdated May 16, 2024 | 7:54 AM
పసిడి ప్రియులకు బిగ్‌ అలర్ట్‌.. వరుసగా తగ్గి సడెన్ షాకిచ్చిన బంగారం..

ప్రస్తుత కాలంలో బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉంటారు. ముఖ్యంగా ఈ బంగారం అభరణాలు ధరించాడమంటే..ఒకప్పుడు మహిళలకే ఎక్కువ మక్కువ అనుకున్నాం. కానీ, నేటి కాలంలో మహిళతో పాటు పురుషులు కూడా రకరకాల మోడల్స్‌ కలిగిన బంగారం అభరణాలు ధరిస్తుండటం మనం చూస్తునే ఉన్నాం. ఇక ఈ పసిడిని ఎంత ఎక్కువగా ఇష్టపడతామో.. వాటి డిమాండ్‌, ధర కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఇక బంగారం ధరలు ఎంత కొండెక్కి కూర్చున్నా.. వాటిని కొనుగోలు చేయడంలో జనం క్యూ కడతరనే చెప్పపడంలో అతిశయోక్తి లేదు. అయితే గత రెండు మూడు నెలల నుంచి ఈ బంగారం ధరలు విపరీతిగా పెరిగిపోవడంతో.. పసిడి ప్రియులు వాటిని కొనుగోలు చేయడంలో కాస్త వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే గత రెండు మూడు రోజులుగా ఈ బంగారం భారీగా ధరలు తగ్గడంతో.. వాటిని కొనుగోలు చేసిన ప్రజలకు కాస్త ఊరట లభించింది.అయితే తాజాగా పసిడి ప్రియులకు సడెన్‌ షాకినిస్తూ బిగ్‌ అలర్ట్ వచ్చింది. ఇంతకి ఏమిటంటే..‌

గత మూడు రోజులపాటు వరుసగా బంగారం ధరలు దిగిరావటంతో కాస్త ఊరట లభించించిన సమయంలో.. తాజాగా ఈ బంగారం ధరలు సడెన్‌ షాకిచ్చాయి. కాగా, ఇవాళ ఒక్కరోజే తులం బంగారం రేటు రూ.430 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర మళ్లీ కొండెక్కినట్లయింది. ఇక మరోవైపు వెండి రేటు సైతం వరుసగా రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లో మే 16వ తేదీన బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

today gold rate

పసిడి ప్రియులకు మరోసారి బిగ్‌ అలర్ట్‌. ఎందుకంటే.. మూడు రోజుల పాటు దిగివచ్చిన బంగారం ధర నేడు ఒక్కసారిగా షాకిచ్చింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రివర్స్ గేర్ వేయడంతో.. అంతర్జాతీయ మార్కెట్ల బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. కాగా, గత మంగళవారం రాత్రి ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో బంగారం ధరలు ఎగబాకాయి. ఇక మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో గోల్డ్ ఫూచర్స్ జూన్ 2024 కాంట్రాక్ట్ ఎక్స్ పైరీ రేటు పెరిగింది. దీంతో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇకపోతే అది దేశీయ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా.. దేశీయంగానూ తులం ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా రూ.430 మేర పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకురూ. 2,395 స్థాయికి చేరుకుంది. దీంతో సరికొత్త రికార్డ్ సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 29.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు రూపాయి మారకం విలువ ఈరోజు కాస్త పుంజుకుంది. ఇక డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం రూ. 83.415 వద్ద అమ్ముడవుతోంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లలో నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు దాదాపు రూ. 900 మేర దిగివచ్చిన తులం బంగారం రేటు ఇవాళ మళ్లీ రూ. 430 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 73 వేల 250 స్థాయికి ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ రూ.400 మేర పెరిగి రూ. 67 వేల 150 వద్దకు పెరిగింది. అలాగే బంగారంతో పాటు వెండి సైతం పోటీ పడుతూ వరుసగా రెండో రోజుల నుంచి పెరిగుతుంది. ఇక నేడు కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 400 మేర పెరిగి రూ. 87 వేల 600 స్థాయికి చేరింది. రెండు రోజుల్లో రూ.1100 మేర పెరగింది. మరి, పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్‌ ను ఇస్తూ బంగారం ధర పెరిగిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి