Tirupathi Rao
Today Gold Price In Hyderabad: బంగారానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందుకే దాని ధర దాదాపుగా పెరుగుతూనే ఉంటుంది. కానీ, ఇప్పుడు కొంచం బంగారం స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అని కూడా అంటున్నారు.
Today Gold Price In Hyderabad: బంగారానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందుకే దాని ధర దాదాపుగా పెరుగుతూనే ఉంటుంది. కానీ, ఇప్పుడు కొంచం బంగారం స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అని కూడా అంటున్నారు.
Tirupathi Rao
గత కొన్నిరోజులుగా బంగారం ధరలు సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు షాకిస్తూనే వస్తోంది. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూనే ఉంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూడటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పచ్చు. అయితే ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడల్లా పెరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఒకవేళ మీరు బంగారం కొనాలి అనుకుంటే మాత్రం ఇదే మంచి సమయంగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడప్పుడే బంగారం పెరిగే అవకాశం లేదు అని చెప్పడానికి అమెరికా కూడా ఒక కారణంగా చెప్పచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వారు అనుకున్న దానికంటే ద్రవ్యోల్భణం దాటిపోయింది. అంటే 2 శాతం కంటే ఎక్కువగా ద్రవ్యోల్భణం ఉంది. అందుకే వాళ్లు తమ వడ్డీరేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆ రేట్లను అమెరికా ఎన్నికలు అయ్యే వరకు స్థిరంగానే ఉంచుతారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ నిర్ణయంతో అంతా ఇప్పుడు అమెరికా డాలర్, ఈల్డ్స్ వైపే పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతో బంగారం పెట్టుబడి స్థానాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. దాంతో కాస్త బంగారం పరుగుకు బ్రేక్ పడ్డట్లు అయ్యింది.
ప్రస్తుతానికి బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశీయంగా బంగారం ధరలు చూస్తే.. నిన్న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,685గా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర ఒక్క రూపాయి పెరిగి రూ.66,686గా కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఒక్క రూపాయి పెరిగింది. నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.7,293గా ఉంది. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.7,294గా ఉంది. ఇంక వెండి ధర కిలోకి రూ.96,600గా కొనసాగుతోంది. వెండి ధర మరింత పతనం అయ్యే అవకాశం కనిపిస్తోంది అంటూ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.