Dharani
Dharani
బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనండి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నేడు మాత్రం భారీగా పడిపోయింది. పండుగల సీజన్‌లో బంగారం కొనాలనే సెంటిమెంట్ ఉన్నవారు.. ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. గత 10 రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు వరుసగా పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. కానీ నేడు మాత్రం గోల్డ్ రేటు దిగి రాగా.. వెండి ధర స్థిరంగా ఉంది. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధర భారీగా పడిపోయింది. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర నేడు దిగి రావడంతో.. ఊరట లభించినట్లయింది. నేడు భాగ్యనగరం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.150 తగ్గి ప్రస్తుతం రూ. 55,050 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా దిగి వచ్చింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద రూ.180 పడిపోయి రూ. 60,050 మార్క్ వద్ద కొనసాగుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో పుత్తడి ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాముల మీద రూ. 150 తగ్గి ప్రస్తుతం రూ. 55,200 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల మీద రూ. 170 పడిపోయి రూ. 60,200 మార్క్ వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గినప్పటికీ వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. భాగ్యనగరంలో క్రితం సెషన్‌లో వెండి ధర కిలో మీద రూ.300 దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మాత్రం హైదరాబాద్‌లో వెండి ధర స్థిరంగా ఉంది. నేడు భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ. 78 వేల వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే వెండి రేటు ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి రేటు రూ. 74,500 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.