వినాయకచవితి పండుగ వేళ మగువలకు శుభవార్త.. దిగొచ్చిన పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే?

Today Gold and Silver Prices: గత వారం రోజులుగా పసిడి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. గత నెలతో పోల్చితే ఈ నెల బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. వినాయక చవితి పండుగ వేళ మహిళలకు గొప్ప శుభవార్త.

Today Gold and Silver Prices: గత వారం రోజులుగా పసిడి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. గత నెలతో పోల్చితే ఈ నెల బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. వినాయక చవితి పండుగ వేళ మహిళలకు గొప్ప శుభవార్త.

భారతీయులు సహజంగానే ప్రసిడి ప్రియులు. బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వారి స్థోమతను బట్టి బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో విదేశాల నుంచి దిగుమతి చేసే బంగారం, వెండిపై సుంఖం తగ్గించారు. దీంతో బంగారం, వెండి ధరలు అమాంతం తగ్గిపోయాయి. కానీ వారం లోపూ మళ్లీ పెరిగిపోయాయి. ప్రస్తుతం పండగుల, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. మహిళలకు శుభవార్త.. ఈ రోజు పసిడి,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

గత కొంతకాంగా బంగారం, వెండి ధరలు తరుచూ పెరుగుతూ వస్తున్న కొనుగోలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ప్రస్తుతం మేలిమి బంగారం రూ.73 దాటిపోయింది. గత నెల నుంచి శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది.. ఈ నేపథ్యంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలు కావండంతో మళ్లీ పసిడి, వెండి కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరపై రూ.10 తగ్గి, రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ.72,750గా ఉంది. ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు.. ఢిల్లీ 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,830, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,900 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కేరళా, కోల్‌కొతా 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,750 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,750 వద్ద కొనసాగుతుంది.  దేశంలో కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఏపీ, తెలంగాణ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 89,900,  బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 82,900, ముంబై, కోల్‌కొతా, కేరళా రూ. 84,900 వద్ద కొనసాగుతుంది.

Show comments