పసిడి ప్రియులకు భారీ ఊరట..తగ్గిన బంగారం ధర! ఇప్పుడే త్వరపడండి..

Gold & Silver Rate On Sept16th 2024: గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం ధర.. ఈ రోజు కాస్త శాంతించింది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎంత ఉన్నాయంటే..

Gold & Silver Rate On Sept16th 2024: గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం ధర.. ఈ రోజు కాస్త శాంతించింది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎంత ఉన్నాయంటే..

ప్రపంచంలో బంగారానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారత దేశంలో అయితే ఈ క్రేజీ మరింత ఎక్కువగా ఉంటుంది. భారతీయులు పసిడిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు పసిడిని ప్రాణంగా చూసుకుంటారు. ఈ బంగారాన్ని అలంకరణ కోసం, ఆర్థిక భరోసా కోసం కొనుగోలు చేస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఈ బంగారం ఆదుకుంటుంది. ఇది ఇలాంటే.. మార్కెట్ లో రోజూ పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో గోల్డ్ రేటు గురించి తెలుసుకునేందుకు పసిడి ప్రియులతో పాటు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేటు..స్వల్ప ఊరటను ఇచ్చింది. మరి..నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

పసిడి ప్రియులకు సోమవారం స్వల్ప ఊరట లభించింది. ఇటీవల కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరగుతున్న సంగతి తెలిసిందే. ఇలా భారీగా పెరిగిన పసిడి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా లేకపోవడంతో బంగారం రేట్లు తగ్గుతాయని కొనుగోలుదారులు భావిస్తున్నారు. దేశీయంగా ధరలు పెరిగేందుకు ప్రధాన కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ధరలు రికార్డ్ అధికంగా ఉండడమేనని బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు సిద్ధమవుతుందన్న వార్తలతో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది.

ఇకపోతే సోమవారం హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో గోల్ట్ రేట్లు  స్థిరంగా ఉన్నాయి. ఇవాళ అనగా సెప్టెంబర్ 16వ తేదీన  22 క్యారెట్ల బంగారం ధర  రూ. 68, 650 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదే విధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. రూ. 74, 890గా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర విషయానికి వస్తే. గత మూడు రోజుల్లో భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా రూ.5,500 మేర పెరిగింది. అయితే సోమవారం మాత్రం కస్టమర్లకు కాస్తా ఊరట ను ఇచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం వెండి ధర స్థిరంగా కొనసాగుతూ ధరల పెరుగుదలకు బ్రేకు పడింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌ లో రూ.97 వేల వద్ద ఉంది.

 ఇక దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని బంగారం ధరల వివరాలు కూడా నేడు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,800 ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 74, 400 పలుకుంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.92 వేల ట్రేడింగ్ అవుతోంది. అయితే బంగారం, వెండి కొనాలనుకునే వారు స్థానిక మార్కెట్లలో ధరలు తెలుసుకోవాలి. జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నుల కలిపితే బంగారం, వెండి ధరల్లో తేడాలు ఉంటాయి. మరి..నేటి గోల్డ్ రేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments