iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర!

  • Published Oct 06, 2023 | 8:56 AM Updated Updated Oct 06, 2023 | 8:56 AM
మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర!

పసిడి ప్రియులకు ఈరోజు కూడా శుభవార్త అనే చెప్పాలి. పది రోజుల నుండి బంగారం ధరలు తగ్గుతునే ఉన్నాయి. దాంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. రాబోయే పండుగలు, శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయదలచిన వారికి ఇది గొప్ప సదావకాశం అంటున్నారు నిపుణులు. ఇటీవల వరుసగా బంగారం రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా ధరలు స్వల్పంగా తగ్గాయి. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గత నెల నుంచి బంగారం, వెండి నేల చూపు చూస్తుంది. వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో దాదాపు రూ.3000 వరకు తగ్గిందని అంటున్నారు. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.190 కి తగ్గి రూ.52,400 పలికింది, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి ప్రస్తుతం రూ.57,160 వద్ద ట్రేడవుతోంది. గత పదిరోజులుగా ఒక్కరోజు మాత్రమే ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 73,500 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.52,500 కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.57,760 ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,760 కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.71,100 లు ఉండగా, చెన్నైలో రూ.73,500, బెంగుళూరులో రూ.69,000 లుగా ట్రెండ్ అవుతుంది.