Gold and Silver Rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు... నేడు ఎంతంటే?

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు… నేడు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతొ బంగారం కొనుగోలు ఎక్కువ అయ్యింది.

Gold and Silver Rates: ఇటీవల పసిడి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతొ బంగారం కొనుగోలు ఎక్కువ అయ్యింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల మహిళలు ఎక్కుగా జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. రక రకాల డిజైన్లతో చేసే బంగారు ఆభరణాలు ధరించేందుకు ఎంతో ఉత్సాహపడతారు. గతకొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం బంగారంపై పడుతుంది. ఈనేపథ్యంలో తరుచూ పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మార్చి మొదటి రెండు వారాలు పసిడి ధరలు పరుగులు పెట్టాయి. వారం రోజులు బంగారం ధరలు తగ్గాయి. ఒకటి రెండు రోజులు ధరలు పెరిగినా ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వేసవి కాలం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. ఈ రోజు వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్ , విశాఖ, విజయవాడ, 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.68,450వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 81,000 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.62,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.68,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.63,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.69,490 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.62,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.68,450 వద్ద కొనసాగుతుంది.

Show comments