P Krishna
P Krishna
దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండారు. గత నెలలో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం వారం రోజుల నుంచి చుక్కులు చూపిస్తుంది. ఒక్క వారంలోనే ఏకగా మూడు వేల వరకు పెరిగిపోయి పసిడి ప్రియులకు షాక్ ఇస్తుంది. ప్రస్తుతం ఇజ్రయెల్ – పాలస్తినాల మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా బంగారంపై భారీగా ప్రభావం పడింది. దీంతో అనూహ్యంగా పసిి ధర పెరిగిపోతూ వస్తుంది. నేటి బంగారం ధరల విషయానికి వస్తే..
బంగారం కొనుగోలుదారులకు చేదు వార్త.. ఆదివారం పసిడి ధరలు మరింత పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం పై ఒకేసారి రూ.1400 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం పై రూ.1530 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కొనసాగుతుంది. దీంతోపాటే పెళ్లిళ్లు సీజన్ కూడా మొదలైంది. మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న సమయంలో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.60,440 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.60,590 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.60,600 వద్ద కొనసాగుతుంది.
ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.60,440 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.77 వేల వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీ, కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.74,100కు చెరింది, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,500గా ఉంది, చెన్నైలో కిలో వెండి ధర రూ.77 వేల వద్ద కొనసాగుతుంది.