బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఈరోజు ఎంతంటే?

Gold and Silver Prices: ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో కొనుగోలుదారులకు అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు పసిడి, వెండి పై పడటం వల్ల స్వల్ప మార్పులు చేర్పులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

Gold and Silver Prices: ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో కొనుగోలుదారులకు అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు పసిడి, వెండి పై పడటం వల్ల స్వల్ప మార్పులు చేర్పులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

దేశంలో రోజు రోజుకీ బంగారం ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల రికార్డు స్థాయిలో పసిడి రేటు పెరిగిన సంగతి తెలిసిందే.   బంగారం కొనేవారికి శుభవార్త. గత వారం నుంచి వరుసగా ధరలు దిగివస్తున్నాయి. శనివారం స్వల్పంగా తగ్గిన ధరలు ఆదివారం నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలో మాత్రం మార్పులు లేవు. ఈ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.  సోమవారం ధరలు స్థిరంగా కొనసాగుతూ ఊరటనిస్తున్నాయి. మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

గత రెండు నెలల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్చి నాటికి పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సమ్మర్ సీజన్ కావడంతో పెళ్లిళ్ల.. ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. అయితే వారం రోజులుగా పసిడి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. మొన్నటి నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.  తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,810 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.80,400 వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాలు  ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,960 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,240 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,810 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,460 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.75,900, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.77,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 80,500 లు ఉండగా, ఢిల్లీ లో రూ.77,400 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments