స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల పసిడి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల వల్ల పసిడి ధరల్లో మార్పులు వస్తున్నాయి.

ఇటీవల పసిడి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల వల్ల పసిడి ధరల్లో మార్పులు వస్తున్నాయి.

భారత దేశంలో బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో కొంత కాలంగా పసిడికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గత ఏడాది చివర్లో గరిష్టంగా పెరిగి బంగారం ధరలు కొత్త సంవత్సరం తగ్గుముఖం పట్టాయి. మళ్లీ రెండు రోజుల క్రితం పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతుంది. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

ఇటీవల దేశంలో బంగారం ధరల్లో తరుచూ మార్పులు వస్తున్నాయి. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న పలు మార్పుల కారణంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయని ఆర్ధిక నిపుణులు. ఈ ఏడాది రెండు వారాల వరకు పసిడి తగ్గు ముఖం పట్టినా మళ్లీ పెరిగిపోయాయి. నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి ధరలు హైదరాబాద్, వరంగల్,  విజయవాడ, విశాఖపట్నం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,100గా కొనసాగుతుంది.  ఆర్థిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,950గా కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 58,400 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63,710గా ఉంది. బెంగుళూరు, కోల్ కొతా లో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర  76,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.57,500 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments