P Krishna
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తున్నాయి. దేశంలో బంగారం వినియోగం ఎక్కువ కావడంతో డిమాండ్ బాగా పెరిగిపోతుంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తున్నాయి. దేశంలో బంగారం వినియోగం ఎక్కువ కావడంతో డిమాండ్ బాగా పెరిగిపోతుంది.
P Krishna
దేశంలో రోజు రోజుకీ బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. గత నెల వరుసగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చాయి. గడిచిన కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు.. ఈ రోజు బంగారం ధరలకు బ్రేక్ పడింది. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. కొత్త ఏడాది బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో మహిళలు జ్యూలరీ షాపులకు క్యూ కడుతున్నారు. తక్కువ ధర ఉన్నసమయంలోనే పసిడి కొనుగోలు చేస్తే లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పులు గోల్డ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
గత మూడు రోజులతో పోల్చితే పసిడి ధర తగ్గింది.. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.250 తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.270 తగ్గింది. అయితే ఈ తగ్గుదల తాత్కాలికం మాత్రమే అంటున్నారు మార్కెట్ వర్గాలు. ఎందుకంటే దేశంలో ప్రస్తుతం బంగారం కొనుగోలు ఎక్కువ కావడంతో డిమాండ్ కూడా అదేస్థాయిలో పెరిగిపోతుంది. దీంతో రోజూ ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయని అంటున్నారు. అయినప్పటికీ మహిళలు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,820 వద్ద ట్రెండ్ అవుతుంది. కొద్దిరోజులుగా వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,650 వద్ద ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,970 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,150 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,530 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ముంబై తో పాటు బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,500 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,820 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 78,600 వద్ద కొనసాగుతుంది. కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద ట్రెండ్ అవుతుంది.