Gold and Silver: మహిళలకు షాకిస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver: మహిళలకు షాకిస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఈ మద్య బంగారానికి రెక్కలు వచ్చాయి.. వరుసగా మూడు రోజుల నుంచి ధరలు పెరుతుగూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు పసిడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఈ మద్య బంగారానికి రెక్కలు వచ్చాయి.. వరుసగా మూడు రోజుల నుంచి ధరలు పెరుతుగూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు పసిడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.. దీంతో మార్కెట్ లో జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల కారణంగా ఆ ప్రభావం బంగారం పై పడుతుందని ఆర్థిన నిపుణులు అంటున్నారు. గత పదిరోజులుగా బంగారం ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతిరోజూ పసిడి ధరలు పెరిగిపోతూ ఉండటంతో వినియోగారులు ఆందోళనలు ఉన్నారు. ఇప్పటికే గోల్డ్ రేట్ మార్కెట్ లో రూ.63 వేలకు చేరింది. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరిగిపోతూ షాక్ ఇస్తున్నాయి. వరుసగా పెరిగిపోతున్న ధరలతో పసిడి కొనుగోలు చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో కొనుగోలుదారులు ఉన్నారు. కానీ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయక తప్పడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. అయితే వ్యాపారులు మాత్రం తమ వ్యాపారం బాగానే సాగుతుందని.. ధరల ప్రభావం పెద్దగా కనిపించడం లేదని.. మహిళలు జ్యులరీ షాపులకు వస్తూనే ఉన్నారని అంటున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,250 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 79,500 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 59,050 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ..64,400 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,850 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 59,900 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.64,250 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక కోల్‌కొతా, ఢిల్లీ, ముంబై లో కిలో వెండి ధర రూ.79,200 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే.. గోల్డ్ రేట్లు అంతర్దాతీయ మార్కెట్ పరిస్థితి, దేశయంగా ఉండే డిమాండ్, పన్నులు, సెన్సులను బట్టి తరుచూ మారుతూ ఉంటాయి.. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు అప్పటి ధరలను పరిశీలించి కొనోగులు చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Show comments