Dharani
బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట కలిగించే వార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు దిగి వచ్చింది. నేడు పసిడి ధర ఎంత ఉందంటే..
బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట కలిగించే వార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు దిగి వచ్చింది. నేడు పసిడి ధర ఎంత ఉందంటే..
Dharani
బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే.. ఈ ఏడాది ఇప్పటికే పసిడి రేటు గరిష్టాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర అయితే ఏకంగా లక్ష రూపాయలు దాటింది. బంగారం రేటు 75 వేలకు చేరువయ్యింది. ఇక గత కొన్ని రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతూ పోతూ ఉన్నాయి. కొన్ని రోజులు మాత్రం తగ్గుతూ వస్తోంది. ఇక క్రితం సెషన్‌లలో భారీగా పెరిగిన పసిడి రేటు.. నేడు మాత్రం దిగి వచ్చి కాస్త ఊరట కలిగించింది. ఇవాళ అనగా.. మంగళవారం నాడు బంగారం ధర తగ్గింది. మరి నేడు మన దగ్గర గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి.. ఎంత మేర దిగి వచ్చాయి అంటే..
నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లో పసిడి రేటు తగ్గింది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల మీద 200 రూపాయలు తగ్గింది. దాంతో నేడు హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల పసిడి రేటు 200 రూపాయలు తగ్గి.. రూ.66,300 వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల రేటు కూడా దిగి వచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాముల మీద రూ. 220 పడిపోయి ఇప్పుడు రూ. 72,330 వద్ద ఉంది. ఇది ఆదివారం నాడు రూ. 660 పెరిగింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు దిగి వచ్చింది. హస్తినలో 22 క్యారెట్ బంగారం పది గ్రాముల మీద రూ. 200 దిగి వచ్చింది. దాంతో నేడు హస్తినలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 66,450 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 220 పతనంతో తర్వాత.. రూ. 72,480 వద్ద అమ్ముడవుతోంది.
నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చినప్పటికీ వెండి రేట్లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఇక నేడు ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు ఇప్పుడు రూ. 91 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 95,600 వద్ధ స్థిరంగా ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లను బట్టి గోల్డ్, సిల్వర్ ధరల్లో తేడా ఉంటుంది. ఈ కారణంతోనే ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో వెండి రేట్లు మాత్రం ఢిల్లీ కంటే హైదరాబాద్‌లోనే కాస్త ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు.