Gold Rate: బంగారం, వెండి కొనాలనుకుంటే త్వరపడండి.. మిస్సయితే బాధపడతారు

బంగారం, వెండి కొనాలని భావిస్తున్నారా.. అయితే త్వరపడండి.. ఈ అవకాశం మిస్‌ చేసుకుంటే.. చాలా బాధపడతారు. మరి నేడు బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయి అంటే..

బంగారం, వెండి కొనాలని భావిస్తున్నారా.. అయితే త్వరపడండి.. ఈ అవకాశం మిస్‌ చేసుకుంటే.. చాలా బాధపడతారు. మరి నేడు బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయి అంటే..

బంగారం కొనాలనుకునే వారు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే గోల్డ్‌ రేటు ఈ ఏడాది గరిష్టాలకు చేరింది. వెండి ధర అయితే ఏకంగా లక్ష రూపాయలు దాటింది. ఇక పసిడి రేటు 75 వేలకు చేరువయ్యింది. ఇక గత కొన్ని రోజులుగా బంగారం ధర దూసుకుపోతుంది. పెరగడమే తప్ప దిగి రావడం లేదు. ఇక ఈ వారంలో పుత్తడి ధర ఒడిదుడుకులకు లోనవుతుంది. కొన్ని రోజులు పాటు భారీ స్థాయిలో దిగి వస్తే.. ఆ వెంటనే పెరుగుతుంది. ఇక వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తుంది. క్రితం రెండు సెషన్లలో దిగి వచ్చిన గోల్డ్‌ రేటు.. నేడు స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం భారీగానే దిగి వచ్చింది. ఇక శుక్రవారం నాడు దేశంలో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

గత రెండు రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర ఇవాళ స్థిరంగా ఉంది. క్రితం సెషన్‌లో పది గ్రాముల పసిడి రేటు 300 రూపాయల మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇక నేడు అదే ధర వద్ద స్థిరంగా ఉంది. ఇక నేడు భాగ్యనగరంలో.. 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర ఏమార్పు లేకుండా 66,150 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు కూడా క్రితం సెషన్‌లో ఎంత ఉందో.. ఇవాళ కూడా అదే రేటు వద్ద ఉంది. నేడు భాగ్యనగరంలో పది గ్రాముల మేలిమి బంగారం ధర 73,310 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు నేడు స్థిరంగా ఉంది.

భారీగా దిగి వచ్చిన వెండి ధర..

నేడు బంగారం రేటు స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం భారీగా దిగి వచ్చింది. కిలో మీద ఏకంగా 800 రూపాయలు తగ్గింది. ఇక నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద 600 రూపాయలు తగ్గి.. రూ.95,200 వద్ద కొనసాగుతోంది. అలానే ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు దిగి వచ్చింది. నేడు హస్తినలో కిలో వెండి ధర కేజీ మీద రూ.600 తగ్గి రూ. 90,700 పలుకుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో వెండి ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకు స్థానిక పన్నులు కారణమవుతుంటాయి. అయితే, పైన పేర్కొన్న ధరల్లో జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు కలపలేదు. అవి కూడా కలుపుకొంటే ధరల్లో కాస్త వ్యత్యాసం ఉంటుందని గమనించాలి.

Show comments