Dharani
Dharani
బంగారం కొనాలని భావించి.. పెరుగుతున్న ధరలు చూసి భయపడుతున్నారా.. ధర తగ్గుతుందేమో అని ఎదురు చూస్తున్నారా.. అయితే మీరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే జూన్ నెల మొత్తం దిగి వచ్చిన బంగారం ధర.. ఈ నెలలో జీవితకాల గరిష్ట స్థాయిలను తాకుతుంది. ఇక బంగారం రేటు విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచాన వేయడం కష్టం కనుక.. ధర దిగి వస్తోన్న తరుణంలోనే బంగారం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల ధర 60 వేలకు చేరగా.. 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల రేటు 55 వేల రూపాయలకు చేరిన సంగతి తెలిసిందే. ఇక క్రితం సెషన్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. నేడు అందుకు భిన్నంగా భారీగా పెరిగింది. మరి నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..
నేడు దేశీయంగా పసిడి ధర పెరగ్గా.. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం ధర పెరిగింది. భాగ్యనగరంలో 22 క్యారెట్ పసిడి రేటు 100 రూపాయలు పెరిగి 55,100 గా ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ పసిడి రేటు కూడా రూ.100 పెరిగి 60,100 వద్ద ట్రేడవుతోంది. అలానే ఢిల్లీలో కూడా బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల పసిడి రేటు 55,130 రూపాయలుగా ఉండగా.. 24 క్యారెట్ పుత్తడి ధర 60,130 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఇక నేడు బంగారం ధర పెరిగినప్పటికి.. వెండి ధర మాత్రం దిగి వచ్చింది. హైదరాబాద్‌లో నేడు సిల్వర్ రేటు 100 రూపాయలు తగ్గి.. కిలో ధర రూ.81,400 వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్‌లో బంగారం ధర 300 రూపాయలు తగ్గిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో వెండి ధర తగ్గగా.. ఢిల్లీలో మాత్రం సిల్వర్ రేటు పెరిగింది. ఢిల్లీలో వెండి రేటు రూ.300 పెరిగింది. దీంతో హస్తినలో కేజీ సిల్వర్ రేటు రూ. 78 వేల మార్కు వద్ద ఉంది. ఇక గత వారం రోజుల్లో ఇక్కడ సిల్వర్ రేటు రూ. 4600 పెరగడం గమనార్హం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1978 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు మాత్రం 25.07 డాలర్లకు ఎగబాకింది.