iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివచ్చిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

  • Published Aug 20, 2024 | 7:50 AM Updated Updated Aug 20, 2024 | 7:50 AM

Gold and Silver Rates:ప్రపంచంలో పసిడి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల బంగారం, వెండి ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి.

Gold and Silver Rates:ప్రపంచంలో పసిడి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల బంగారం, వెండి ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి.

పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివచ్చిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్ల సందడి మొదలైంది. బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. ఇటీవల పసిడి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునే సందిగ్ధంలో పడిపోతున్నారు. ఎప్పుడు పసిడి కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడుతున్నాయని నిపుణులు అంటున్నారు. మహిళలకు గుడ్ న్యూస్.. నేడు పసిడి కాస్త దిగివచ్చింది. మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గతనెల పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాల నుంచి దిగిమతి అయ్యే పసిడిపై సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపారు. అంతే మరుసటి రోజు పసిడి ధరలు భారీగా దిగి వచ్చాయి. ఒక్క వారంలోనే ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరిగిపోతూ వస్తుంది. మొన్నటి వరకు పెరిగిపోతూ వచ్చిన పసిడి రాఖీ పండుగ సందర్భంగా కాస్త దిగి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, 66,690 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, 72,760వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,690 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,760 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢీల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,840 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72,760 వద్ద కొనసాగుతుంది.  ముంబై, పూనె, కేరళా, బెంగుళూరు, కోల్‌కొతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,690 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72,760 ద్ద కొనసాగుతుంది.  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,690 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72,760 ద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ. 100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 90,900 ఉండగా, ఢిల్లీ, కోల్‌కొతా, జైపూర్, పూణే లో కిలో వెండి ధర రూ. 85,900 వద్ద కొనసాగుతుంది.