గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర.. నేటి ధరలు ఇవే

పండుగల సీజన్‌ ప్రారంభమైంది.. బంగారం కొందామనుకుని ఆలోచిస్తున్న వారికి పసిడి ధర భారీగా షాక్‌ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగడం లేదంటే.. దిగి రావడం చేస్తోన్న బంగారం ధర.. గత నాలుగు సెషన్ల నుంచి వరుసగా పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా గోల్డ్‌ ధర పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఈ నెల తొలి వారంలో వరుసగా దిగివచ్చిన బంగారం ధర ఇప్పుడు పెరుగుతుండడం పసిడి ప్రియులను కలవరపెడుతోంది. గోల్డ్‌ రేటు ప్రస్తుతం గరిష్ట స్థాయిలకు చేరుకుంది. ఇక నేడు హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లల్లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్ల వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధర పెరిగింది. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 140 పెరిగి ప్రస్తుతం రూ. 55,050 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా భారీగానే పెరిగింది. నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 180 పెరిగి.. రూ. 60,080 మార్క్ వద్దకు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాముల ధర నేడు రూ. 140 పెరిగి ప్రస్తుతం రూ. 55,200 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 160 పెరిగి రూ. 60,210 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

అక్కడ తగ్గిన వెండి రేటు..

బంగారం ధర వరుసగా పెరిగి షాక్‌ ఇస్తుంటే.. వెండి రైటు మాత్రం కాస్త ఊరట కలిపించింది. నేడు దేశీయల బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ ధర పెరగ్గా.. వెండి రేటు మాత్రం దిగి వచ్చింది. నేడు దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలో మీద రూ. 200 పడిపోయి ప్రస్తుతం రూ. 74,500 మార్క్ వద్దకు దిగివచ్చింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో మాత్రం వెండి రేటు ఇవాళ స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,200 మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1934 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.29 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.

Show comments